
📌 Key Points
- సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టాలని అనుకుంటారు, కొందరికి అదృష్టం త్వరగా వరిస్తుంది.
- నటి మీనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కుటుంబాన్ని మిస్ అయినట్టు ఫీలయ్యారు.
- మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- భర్త మరణం తర్వాత కూతురితో కలిసి జీవిస్తున్న మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
ప్రముఖ నటి మీనా తాజాగా తన సినీ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి క్షణం ఆనందిస్తున్నానని ఆమె అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో మీనా ప్రస్థానం
Actress Meena: సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఎంతోమంది తమ కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తమను తాము నిరూపించుకోవడానికి సమయం పడుతుంది. కొంతమందికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే అదృష్టం తలుపుతడితే.. మరికొంతమంది ఆ అదృష్టం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. ఈ ఎదురుచూపుల సమయంలో కుటుంబానికి కూడా దూరం కావాల్సి వస్తుంది. అటు కుటుంబం ఇటు సన్నిహితులు, బంధువులు అందరిని చాలా మిస్ అవుతూ ఉంటారు..
ఇక పండుగలు వచ్చాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితే.. సెలెబ్రిటీలు మాత్రం ఎక్కడో తమ సినిమా షూటింగ్ల కారణంగా సినిమా వాళ్లతోనే సెలబ్రేట్ చేసుకునే రోజులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నామనే వేదన వారిలో బయటకు కనిపించకపోయినా . మనసులో మదన పడుతూనే ఉంటారు. అయితే ఈ విషయంలో తాను కూడా అలాగే కృంగిపోయానని.. కానీ అమ్మవల్లి అప్పటినుంచి ప్రతి రోజును ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పు చెప్పుకొచ్చింది సీనియర్ నటీమణి మీనా(Meena ). ఇక తాను కూడా అందరిలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కుటుంబాన్ని మిస్ అవుతున్నాను అనే భావన ఎక్కువగా ఉండేదని. కానీ ఆ తర్వాత కాలంలో తనలో కలిగిన మార్పును స్వీకరించి ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కుటుంబానికి దూరంగా షూటింగ్స్ లో మీనా
విషయంలోకి వెళ్తే ..చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు, తమిళ్ చిత్రాలలో బాలనటిగా నటించి, మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. రజినీకాంత్, కమలహాసన్, చిరంజీవి, వెంకటేష్ తదితర నటులతో నటించిన ఈమె కథానాయికగా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ముత్తు సినిమాతో జపాన్లో ఇప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన ఈమె.. వెంకటేష్ తో కలసి సుందరకాండ ,చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన చిత్రాలు చేసి మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ జోడిగా పేరు దక్కించుకుంది.
వృత్తిపరంగా కెరియర్ పీక్స్ లో ఉండగానే.. 2009లో వివాహం చేసుకుంది. ఇక వివాహం జరిగిన 13 ఏళ్ల తర్వాత అనగా 2022లో ఈమె భర్త విద్యాసాగర్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఇక అప్పటి నుంచి కూతురు నైనికతో కలిసి జీవిస్తున్న ఈమె ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొంతమంది ఆకతాయిలు అదేపనిగా టార్గెట్ చేసుకొని ఫలానా హీరోను పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు రకాల రూమర్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మీనా రెండో పెళ్లి వార్తలపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటరిదాన్ననే కదా మీ ఆకతాయి పనులు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అదే ఇంటర్వ్యూలో నటిగా తన జ్ఞాపకాలను పంచుకుంది.
భర్త మరణం తర్వాత మీనా సెకండ్ ఇన్నింగ్స్
“ఒకప్పుడు వరుస షూటింగ్ లతో పండుగలకు కూడా ఇంటికి వెళ్లలేక బాధపడేదాన్ని. అయితే ఆ సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది. కొత్త దర్శకులు, నటీనటులు, ప్రదేశాలతో గడిపే అవకాశం అందరికీ రాదు అని.. మా అమ్మ చెప్పిన మాటలను నేను గుర్తు పెట్టుకొని ఇక ఆ రోజు నుంచి ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను” అంటూ మీనా తెలిపింది. మొత్తానికైతే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్లే మీనా అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కామెంట్లు చేసింది. అయితే అలాంటి ఈమెపై ఇలా సెకండ్ మ్యారేజ్ వార్తలు రావడం నిజంగా బాధాకరం అని చెప్పాలి.
నటి మీనా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం తన కూతురితో సంతోషంగా జీవిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఆమె అనుభవాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.


