
టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ గుప్తంగా నిశ్చితార్థం చేసుకుంది. ఆమె తన కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగనుందని సమాచారం.
Key Points
నటి నివేదా పేతురాజ్ గుప్తంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
ఆమె తన కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు.
వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది.
నివేదా పేతురాజ్ నిశ్చితార్థం
క్యూట్ బ్యూటీ నివేదా పేతురాజ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఆమె వేరే వాళ్లతో డేటింగ్ లో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు, స్టోరీ పెట్టింది. ఈ ఫొటలతో నివేదా ఎంగేజ్మెంట్ జరిగిందనే క్లారిటీ వచ్చింది.
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతని పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. రాజ్‌హిత్ ను రొమాంటిక్ గా హగ్ చేసుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది నివేదా. ఈ ఫొటోకు రెండు రెడ్ లవ్ ఎమోజీలు, మధ్యలో అంతులేని ప్రేమను చాటే ఇన్ఫినిటీ ఎమోజీను పెట్టి పోస్టు చేసింది నివేదా.
కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్
ఇక ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లోనూ రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ఉన్న ఫొటోలను నివేదా షేర్ చేసింది. ఈ పిక్స్ ను పోస్టు చేసిన ఆమె లవ్ సింబల్స్ తో పాటు రింగ్ ఎమోజీని కూడా పోస్టు చేసింది. దీంతో వీళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివర్లో నివేదా, రాజ్‌హిత్ ఇబ్రాన్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది.
నివేదా పేతురాజ్ తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ పోస్టు పెట్టగానే ఎవరీ రాజ్‌హిత్ ఇబ్రాన్ అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. రాజ్‌హిత్ ఇబ్రాన్ దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ అని తెలిసింది. నివేదా కుటుంబం కూడా చాలా కాలం నుంచి దుబాయ్ లోనే ఉంటుంది. అక్కడే నివేదా, రాజ్‌హిత్ ఇబ్రాన్ మధ్య పరిచయం మొదలై ప్రేమగా మారిందని టాక్. ఇప్పుడు పెళ్లికి కూడా రెడీ అయ్యారు.
వైరల్ ఫోటోలు
నివేదా పేతురాజ్ రిలేషన్ లో ఉందని, డేటింగ్ చేస్తుందనే రూమర్లు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో డేటింగ్ లో ఉందనే వార్తలు వైరల్ గా మారాయి. దుబాయ్ లో నివేదాకు ఖరీదైన బంగ్లా కూడా గిఫ్ట్ గా ఇచ్చారనే కామెంట్లు వినిపించాయి. మరోవైపు తెలుగులో విష్వక్ సేన్ తో మూడు సినిమాలు చేయడంతో అతనితో లవ్ లో ఉందనే గుసగుసలు వినిపించాయి. కానీ ఇవన్నీ వట్టి రూమర్లేనని ఇప్పుడు స్పష్టమైంది.
2016లో ఒరు నాల్ కోత్తు సినిమాతో తెరంగేట్రం చేసింది నివేదా. మెంటల్ మదిలో మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. టాలీవుడ్ లో చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అలా వైకుంఠపురంలో, రెడ్, పాగల్, విరాట పర్వం, దాస్ కా దమ్కీ, బూ సినిమాలు చేసింది.
నివేదా పేతురాజ్ మరియు రాజ్‌హిత్ ఇబ్రాన్‌ల ప్రేమకథకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి వివాహం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


