
📌 Key Points
- నటి ప్రగతి 10టీవీ పాడ్‌కాస్ట్‌లో తన కెరీర్ గురించి మాట్లాడారు.
- ఒకే తరహా పాత్రల్లో తనను ట్రాప్ చేశారని ప్రగతి ఆవేదన వ్యక్తం చేశారు.
- ఏ పాత్రనైనా చేయగలనని, పరిమితులు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.
- అమ్మ పాత్రల్లోనూ విభిన్న కోణాలు చూపిస్తానని ప్రగతి అన్నారు.
సినీనటి ప్రగతి తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే తరహా పాత్రలకు తనను పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఎటువంటి పరిమితులు పెట్టుకోలేదని 10టీవీ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. తన ఛాయిసెస్ మార్చుకున్నానని ప్రగతి స్పష్టం చేశారు.
పాత్రల ఎంపికపై ప్రగతి కొత్త నిర్ణయాలు
Actress Pragathi: సినిమాల్లో ఏదో ఒక రకమైన పాత్రలో నటించడానికి తాను పరిమితం కాలేదని, అన్ని రకాల పాత్రలు చేయగలనని సినీనటి ప్రగతి అన్నారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో ప్రగతి మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు.
“నా ఛాయిసెస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు మార్చుకున్నాను. నాకు జిమ్‌లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సినిమా షూటింగ్ సెట్‌లో నుంచి ఒక పర్ఫామ్ చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఒక కేటగరైజ్ చేసి నన్ను ఒక పర్టికులర్ క్యారెక్టర్‌లో ట్రాప్ చేసి పెట్టారు. ఇంకా ఎన్నో చేయాలి. అందుకని కొన్ని మానుకోవాల్సి వస్తుంది.
ఒకే తరహా పాత్రల్లో నన్ను బంధించారు: ప్రగతి
ఇప్పుడు చేసేది ఏ క్యారెక్టర్ అయినా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఏజ్ అనే ప్రాబ్లం లేదు. నేను ఏ పాత్రనైనా చేయగలను. ఇప్పుటిదాకా వాళ్లు ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు.. ఇంక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటున్నానో అలాగే చూస్తారు.
ఏ పాత్రనైనా చేయగలను.. పరిమితులు లేవు: నటి
అమ్మ పాత్ర నెగిటివ్ పాత్ర అవ్వచ్చు.. అమ్మ పాత్ర పాజిటివ్ అవ్వచ్చు.. అమ్మ గయ్యాలిగా ఉండొచ్చు. ఇందులో చాలా వెరైటీల అమ్మ పాత్రలు చేయగలను. ఏ క్యారెక్టర్ అయినా నేను చేయడానికి రెడీ. కాకపోతే ఏదో ఒక పర్టికులర్ స్లాట్ కాకుండా అన్నీ చేయడానికి రెడీ. ఇప్పటివరకు నేను చేయని పాత్రలో, ఒక కొత్త కోణంలో నన్ను నేను చూడాలనుకుంటున్నా” అని ప్రగతి తెలిపారు.
తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి
మొత్తంగా, ప్రగతి తన నటనకు ఎలాంటి హద్దులు లేవని స్పష్టం చేశారు. కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, విభిన్నమైన కోణాల్లో తనను తాను చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. నటిగా తన కొత్త ప్రయాణం ఆసక్తిని రేపుతోంది.


