|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీకాంత్ తో రాశి ఎఫైర్ నిజమేనా? సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్ రాశి!

Published: 24-03-2026, 2:05 AM
శ్రీకాంత్ తో రాశి ఎఫైర్ నిజమేనా? సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్ రాశి!
  • హీరో శ్రీకాంత్ తో ఎఫైర్ రూమర్లపై స్పందించిన రాశి.
  • శ్రీకాంత్ తో కలిసి 8 సినిమాల్లో నటించానని తెలిపిన రాశి.
  • తండ్రి చివరి సినిమా చూసి మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్న రాశి.
  • బర్త్ డే రోజునే తండ్రి చనిపోవడంతో బర్త్ డే చేసుకోవడం మానేసిన రాశి.

సీనియర్ హీరోయిన్ రాశి ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తో తన ఎఫైర్ రూమర్స్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా తన తండ్రి గురించి, సినీ జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ తో ఎఫైర్ రూమర్స్ పై రాశి క్లారిటీ

Actress Raasi:ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్.. అందాల తార రాశి (Raasi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్ తో పాటు ఇతర భాషలలో 300కు పైగా సినిమాలలో నటించింది. ఒక్క హీరోయిన్ గానే 140కి పైగా చిత్రాలలో నటించిన ఈమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అడపదడపా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న రాశిపై ఒకప్పుడు ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించిన విషయం తెలిసిందే . ముఖ్యంగా హీరో శ్రీకాంత్ తో ఈమె రిలేషన్ లో ఉందనే వార్తలు అప్పట్లో చాప కింద నీరుల వ్యాపించాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత శ్రీకాంత్ తో రిలేషన్ గురించి ఓపెన్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది రాశి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ రాశి మాట్లాడుతూ.. “నేను పుట్టి పెరిగిందంతా ఇండస్ట్రీలోనే.. నా లైఫ్ ఓపెన్ బుక్ ..పెళ్లి ముందు వరకు నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పెళ్లి తర్వాత నేను నా వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్లే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. మా నాన్న నా కెరియర్ ని హీరోయిన్గా పీక్స్ లో చూసే చనిపోయారు. ఇక అది చాలు నాకు. ఇంతకంటే ఏం కావాలి .మా నాన్న అనుకున్నట్టుగానే నాకు రావాల్సిన క్రేజ్ వచ్చింది. అయితే ఆ క్రేజ్ అలా ఉండిపోయింది. ప్రేయసి రావే లాంటి మైలురాయి చిత్రాలు నా కెరియర్ లో ఎన్నో ఉన్నాయి. కొన్ని తరాల వరకు నా గురించి మాట్లాడుకుంటారు. కానీ ప్రేయసి రావే సినిమా మాత్రం ఆల్ టైం నా ఫేవరెట్ మూవీ.. నాకు పర్సనల్గా ఎమోషన్ కూడా ..ఆ సినిమాను ఎవరు మర్చిపోయినా కూడా నేను ఏమాత్రం మర్చిపోలేను . ఎందుకంటే మా నాన్న ఆ సినిమా చూసి ఫస్ట్ ఫోన్ చేసి అదిరిపోయింది అని చెప్పారు . చివరిగా ఆయన చూసిన సినిమా కూడా అదే. అందుకే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..నా బర్త్ డే రోజునే మా నాన్న చనిపోయారు . ఆ సెంటిమెంట్ వల్లే నేను బర్తడే చేసుకోవడం కూడా మానేశాను అంటూ తెలిపింది రాశి.

సినీ జీవితం గురించి రాశి ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రి మరణం గురించి రాశి ఎమోషనల్ కామెంట్స్

అలాగే శ్రీకాంత్ తో రూమర్స్ గురించి మాట్లాడుతూ.. నేను శ్రీకాంత్ కలిసి మొత్తం ఎనిమిది సినిమాలు చేశాము. ప్రతి హీరోతో కూడా నాకు చాలా సినిమాలు ఉన్నాయి. మాపై గాసిప్లు వచ్చేవి కాదు. కానీ శ్రీకాంత్ తో కావాలని రూమర్లు గుప్పించారు. అయితే మాది హెల్తీ రిలేషన్షిప్ అలాగే ఇండస్ట్రీలో జెడి నా బెస్ట్ ఫ్రెండ్. ఒకప్పుడు ఒక జంట ఎన్ని సినిమాలలో కలిసి కనిపించినా ఎలాంటి రూమర్లు వచ్చేవి కాదు ..కానీ ఇప్పుడు ఒక జంట వరుసగా రెండు మూడు సినిమాలు కలిసి చేస్తే చాలు వాళ్ళకి లేని ఫీలింగ్స్ ని కూడా మీరు కలిగిస్తున్నారు. వాళ్ళు నిజంగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చెడులో కూడా మంచి అంటే ఇదే అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే రాశి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రాశి తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. శ్రీకాంత్ తో రూమర్స్ గురించి స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టారు. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనివ్వడం వల్లే సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.