|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాశి సంచలనం: పెళ్ళి కోసం బరువు పెరిగాను! షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి!

Published: 23-03-2026, 12:35 PM
రాశి సంచలనం: పెళ్ళి కోసం బరువు పెరిగాను! షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి!
  • ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రాశి, వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.
  • బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చిన రాశి, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు.
  • పెళ్లి చేసుకోవడానికే లావు అయ్యానని రాశి షాకింగ్ కామెంట్ చేశారు.
  • చిరంజీవితో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి రాశి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రాశి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, ఆమె మళ్ళీ బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ సీరియల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోయిన్‌గా రాశి కెరీర్

Actress Raasi: రాశి, ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు స్టార్ నటిగా మంచి మంచి పాత్రలు పోషించి, హీరోయిన్‌గా సత్తా చాటారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన కూడా ఆమెకు అవకాశం వచ్చింది. అలాంటి స్టార్ స్టేటస్ అనుభవించిన రాశి (Actress Raasi).. తర్వాత పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ (Janaki Kalaganaledu) అనే సీరియల్‌తో అందరికీ టచ్‌లోకి వచ్చిన రాశి, వెండితెరపై కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆమెకు మంచి మంచి పాత్రలే పడుతున్నాయి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికే బాగా లావయ్యాను అంటూ షాకింగ్‌గా చెప్పారు. అలా ఎందుకు అన్నారో, ఆమె మాటల్లోనే..

బుల్లితెరపై రీఎంట్రీ, సెకండ్ ఇన్నింగ్స్

‘‘దాదాపు 140 సినిమాలు చేశాను. నేను అడ్వాన్స్ తీసుకుని ఆగిపోయిన సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిన సినిమా. నేను, ఆర్తీ అగర్వాల్ అందులో చేయాలి. విఎన్ ఆదిత్య దర్శకుడు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. 6 నెలల తర్వాత అనుకుంటా, స్టోరీ సరిగా కుదరలేదని ఆపేసినట్లుగా తెలిసింది. ఇప్పుడు జీరో సైజ్ అదీ ఇదీ అని అంటున్నారు. కానీ, నేను పెళ్లి చేసుకోవడానికే లావయ్యను. పెళ్లి చేసుకోవడానికి లావై, పెళ్లి తర్వాత ఇంకా బాగా లావయ్యాను. నేను లావుగా ఉంటే ఇక కెరీర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. కెరీర్‌లో పీక్ చూశాను. ఇంకేం చూడాలి. అందుకే, లావుగా ఉంటే ఎవరూ మనల్ని కదిలించరు అని, కావాలని లావయ్యాను. కెరీర్ గురించి ఆలోచించకుండా, లైఫ్ ఏంటనే ఆలోచించాను’’ అని రాశి చెప్పుకొచ్చారు.

పెళ్లి గురించి రాశి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా.. జీరో సైజ్‌ని ఇష్టపడతాను. కానీ, రాశి అప్పట్లోనే కాస్త బొద్దుగా కనిపించేది. నిజంగానే ఆమె పెళ్లి తర్వాత బాగా లావయ్యారు. మళ్లీ నటనలోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు సడెన్‌గా ఆమె ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అంత లావుగా మారిన రాశి, ఆ సీరియస్‌లో చాలా వరకు తగ్గిపోయి కనిపించారు. ఇప్పుడు, వెండితెరపై కూడా అవకాశాలు వస్తుండటంతో.. చాలా వరకు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. అయితే వాటిని కూడా ఎలా పడితే అలా సెలక్ట్ చేసుకోనని, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తున్నానని రాశి చెప్పుకొచ్చారు.

మొత్తానికి రాశి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.