|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అత్యాచారం చేస్తామంటూ నటి రమ్యకు హీరో ఫ్యాన్స్‌ హెచ్చరిక

Published: 28-07-2025, 5:17 AM
అత్యాచారం చేస్తామంటూ నటి రమ్యకు హీరో ఫ్యాన్స్‌ హెచ్చరిక

కన్నడ నటి మరియు రాజకీయ నాయకురాలు రమ్యను దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. రమ్య పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.

Key Points

1

దర్శన్ అభిమానులు నటి రమ్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

2

అత్యాచారం చేస్తామని బెదిరింపులు, హత్య చేస్తామని హెచ్చరికలు.

4

మహిళలపై ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా రమ్య పోరాటం.

సోషల్ మీడియాలో రమ్యపై ట్రోలింగ్

కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య)పై దర్శన్ ‌ అభిమానులు ట్రోలింగ్ ‌ కు దిగారు . సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ ‌ చేస్తూ బూతులతో విరుచుకపడుతున్నారు . ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ మెసేజులు చేస్తున్నారు . రేణుకస్వామికి బదులుగా నిన్ను ( రమ్య ) హత్య చేసి ఉంటే బాగుండేదని మరికొందరు దర్శన్ ‌ ఫ్యాన్స్ ‌ హెచ్చరిస్తున్నారు . రోజురోజుకు వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించనున్నారు .

ఈ అంశంపై ఇండియా టుడేతో ప్రత్యేకంగా రమ్య ఇలా మాట్లాడింది . ‘ బెంగళూరు కమిషనర్ ఈ రోజు నాకు సమయం ఇస్తున్నారు, కాబట్టి నేను వెళ్లి ఆయన్ను కలుస్తాను. నేను నా న్యాయవాదులను కూడా ఇప్పటికే సంప్రదించాను . ఎవరైతే నా కుటుంబంపై ట్రోల్ ‌ చేస్తున్నారో వారందరిని గుర్తించాము . నన్ను అసభ్యంగా బూతులు తిట్టేవారి సోషల్ మీడియా ఖాతాలను క్రోడీకరించాం . పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాము ‘ అని ఆమె వివరించారు.

అత్యాచార, హత్య బెదిరింపులు

మహిళా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో కొందరు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని నటి రమ్య చెప్పారు . సమాజంలో ఇలాంటి చర్యలు చాలా బాధాకరమన్నారు . మహిళలను టార్గెట్ ‌ చేస్తూ బూతులు తిట్టడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు . అలాంటి వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడంతోనే వారు ఇలా రెచ్చిపోతున్నారని చెప్పింది . ఒక బలమైన మహిళను ఎదుర్కొవాలంటే మొదట ఆమె క్యారెక్టర్ ‌ ను దెబ్బకొట్టేలనే పన్నాగంతో కొందరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని రమ్య పేర్కొంది .

పోలీసులకు ఫిర్యాదు చేయనున్న రమ్య

గతంలో దర్శన్‌పై చేసిన కామెంట్‌ వల్లనే.. లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న దర్శన్‌ .. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది . తన ప్రియురాలిని సోషల్ ‌ మీడియాలో తిట్టాడని రేణుకస్వామిని హత్య చేసి దర్శన్ ‌ పెద్ద తప్పు చేశాడని ఆమె చెప్పింది . ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు .. ? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్‌ బ్లాక్‌ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్‌ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదంటూ పలుమార్లు దర్శన్ ‌ ను రమ్య తప్పుబట్టింది.

నటి రమ్య ఎదుర్కొంటున్న సోషల్ మీడియా వేధింపులు తీవ్రమై, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె నిర్ణయించుకుంది. ఈ ఘటన మహిళల భద్రతపై ప్రశ్నార్థకం గుర్తునుంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.