
📌 Key Points
- మహేష్ బాబుని రెండుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ సౌందర్య.. షాకింగ్ రీజన్స్!
- యువరాజు సినిమాలో మహేష్ పక్కన చిన్నవాడిగా కనిపించాడని సౌందర్య నో చెప్పడం సంచలనం!
- అర్జున్ సినిమాలో అక్క పాత్ర కోసం సౌందర్యని అడిగిన గుణశేఖర్.. మళ్ళీ రిజెక్ట్!
- సౌందర్య, మహేష్ బాబు కాంబినేషన్ మిస్ అయినందుకు అభిమానుల నిరాశ!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక సంచలన వార్త! మహేష్ బాబుతో నటించడానికి హీరోయిన్లు పోటీ పడుతుంటే, ఒక హీరోయిన్ మాత్రం రెండుసార్లు నో చెప్పింది. ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేసింది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి!
మహేష్ బాబుకి ఎదురైన చేదు అనుభవం!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గ్లోబల్ ఫిల్మ్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన `వారణాసి` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి ఈ మూవీ తెరకెక్కుతుంది. గ్లోబల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. సుమారు రూ.1300-1400కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ నో చెప్పరు. ఇంకా ఎగిరి గంతేస్తారు. చాలా మంది హీరోయిన్లు ఆయనతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం మహేష్ తో సినిమా చేయడానికి నో చెప్పిందట. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఇదే జరిగింది. మొదటసారి తనకంటే చిన్న వాడుగా ఉన్నాడని, రెండోసారి అక్కగా నటించనని. ఇలా రెండు సార్లు మహేష్ బాబుకి చేదు అనుభవం ఎదురయ్యింది.
సౌందర్య రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదే!
మరి ఇంతకి మహేష్ బాబుని రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరనేది చూస్తే, ఆమె ఎవరో కాదు సౌందర్య. ఒకప్పుడు సహజ నటిగా పేరుతెచ్చుకుంది. అద్భుతమైన నటిగా రాణించింది. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి మెప్పించింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలో మహేష్ బాబు హీరోగా `యువరాజు` అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మొదట హీరోయిన్‌గా సౌందర్యనే ఎంపిక చేశారు. ఆ సమయంలో ఫోటో షూట్ చేయగా, సౌందర్య ముందు మహేష్ చిన్నగా కనిపిస్తున్నాడట. సౌందర్యకి తమ్ముడిలా ఉన్నాడట. దీంతో ఈ సినిమా చేసేందుకు సౌందర్యనే నో చెప్పిందట. అలా సౌందర్యతో కలిసి నటించే అవకాశాన్ని మహేష్ బాబు కోల్పోయాడు. ఆ తర్వాత సిమ్రాన్ ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
మరోసారి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. `అర్జున్` మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. గుణ శేఖర్ దర్శకత్వంలో `అర్జున్` మూవీ రూపొందింది. ఇందులో మహేష్ బాబుకి జోడీగా శ్రియా నటించింది. ఆయనకు అక్క పాత్రలో కీర్తి రెడ్డి నటించింది. అయితే ముందుగా ఆ పాత్ర కోసం సౌందర్యనే అడిగారట. అప్పుడు కూడా తాను మహేష్ కి అక్కగా చేయనని చెప్పిందట. ఇలా రెండు సార్లు మహేష్ బాబుని రిజెక్ట్ చేసింది సౌందర్య. మొత్తంగా ఈ అరుదైన కాంబినేషన్ సెట్ కాకుండానే పోయింది. అదే ఏడాది సౌందర్య ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
మిస్సయిన అద్భుతమైన కాంబినేషన్!
సౌందర్య, మహేష్ బాబు కలిసి నటిస్తే అదొక అద్బుతమైన జోడీగా నిలిచిపోయేది. అభిమానులు పండగ చేసుకునేవారు. ఎంతో మంది అభిమానుల కోరిక కూడా. కానీ అది నెరవేరకుండానే సౌందర్య చనిపోవడం బాధాకరం. ఇక మహేష్ బాబు నటిస్తున్న `వారణాసి` మూవీ ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథతో సాగుతుందని రాజమౌళి తెలిపిన విషయం తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
సౌందర్య, మహేష్ బాబు కలిసి నటించకపోవడం నిజంగా దురదృష్టకరం. వారి కాంబినేషన్ కోసం ఎదురు చూసిన అభిమానులకు ఇది తీరని లోటు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


