|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా అవకాశం కోసం వస్తే టార్చర్ పెట్టారు…హీరోయిన్ సంచలనం !

Published: 24-06-2025, 10:18 PM

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తరచుగా వినవచ్చు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తన అనుభవాలను వెల్లడించి సంచలనం సృష్టించారు.

Key Points

1

సినిమా అవకాశాల కోసం వచ్చిన వారిని వేధించే దర్శక నిర్మాతల గురించి ఫాతిమా సనా షేక్ వెల్లడి

2

క్యాస్టింగ్ కౌచ్‌పై ఫాతిమా సనా షేక్ ఆవేదన వ్యక్తం

4

ఫాతిమా సనా షేక్ అనుభవం ఇండస్ట్రీలోని అనేక అవమానాలను వెలుగులోకి తెస్తుంది

ఫాతిమా సనా షేక్ సంచలన వెల్లడి

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ( Bollywood) నుంచి మన టాలీవుడ్ ( Tollywood) వరకు… చాలా మంది భామలు… తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే సమయంలో కొత్త హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్లను… కొంత మంది దర్శక నిర్మాతలు వేధిస్తున్నారని ఇప్పటికి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

క్యాస్టింగ్ కౌచ్‌పై ఆవేదన

ఈ నేపథ్యంలోనే క్యాస్టింగ్ కౌచ్ (Casting couch) అంశంపై చాలామంది సీనియర్లు కూడా… రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తమకు గతంలో అనుభవమైన సన్నివేశాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో హీరోయిన్ తన కెరీర్ మొదట్లో జరిగిన అవమానాన్ని బయటపెట్టింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ భామ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Sheikh). కెరియర్ మొదట్లో… తనను ఓ సెకండ్ గ్రేడ్ నటిగా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇండస్ట్రీలోని అవమానాలు

కానీ తాను మాత్రం జూనియర్ ఆర్టిస్టుల నుంచి… హీరోల వరకు అందరినీ సమానంగా చూస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. ఆమె నటించిన మెట్రో ఇన్ దినో మూవీ (Metro In Dino ) ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను పేర్కొంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే నటీనటులను చులకనగా చూస్తారన్నారు హీరోయిన్ ఫాతిమా సనా షేక్. ఆ బాధను తాను ఎంతో అనుభవించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి బాధను ఎవరు కూడా అనుభవించకూడదని వెల్లడించారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని అనేక అవమానాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ విషయంపై చర్చ జరగడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.