
📌 Key Points
- టీనా శ్రావ్య చేసిన పని సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది!
- పెంపుడు కుక్కకు తూకం వేసి బెల్లం సమర్పించిన టీనా శ్రావ్య
- ఆదివాసి దేవతలను అవమానించారంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం
- కుక్కకు మొక్కు చెల్లించామని వివరణ ఇచ్చిన టీనా శ్రావ్య తల్లి
టాలీవుడ్ నటి టీనా శ్రావ్య చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన పెంపుడు కుక్కకు తూకం వేసి మొక్కులు తీర్చుకోవడంతో వివాదం మొదలైంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
కుక్కకు తూకం వేసిన నటి!
ప్రస్తుతం మేడారం జాతర హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కుంభమేళ తరహాలోనే ఈ మేడారం జాతర జరుగుతుంది. కోటికి పైగా భక్తులు ఇక్కడి వనదేవతలను దర్శించుకుంటారు. అలాగే ఎత్తు బంగారం రూపంలో బెల్లాన్ని కూడా సమర్పిస్తారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టీనా శ్రావ్య ( Actress teena sravya) చేసిన పని వైరల్ గా మారింది.
తన పెంపుడు కుక్కకు సమానంగా తులాభారాన్ని ఇచ్చింది నటి శ్రావ్య. ఆ పెంపుడు కుక్కకు సమానంగా బెల్లాన్ని తక్కెడలో వేసి.. తన మొక్కులు తీర్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన నెటిజెన్స్, టీనా శ్రావ్యపై ఫైర్ అవుతున్నారు. మనుషులకు తులాభారం ఇవ్వాలి కానీ.. ఇలా జంతువులకు తులాభారం ఇవ్వబోరని సీరియస్ అవుతున్నారు. ఆదివాసి దేవతలను అవమానించడానికి ఇలా నటి టీనా శ్రావ్య వ్యవహరించారని మండిపడుతున్నారు జనాలు. అయితే దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు టీనా శ్రావ్య తల్లి. పెంపుడు కుక్కకు సంబంధించిన మొక్కు ఉందని… అందుకే ఈ ఏడాది చెల్లించామని పేర్కొంది.
నెటిజన్ల ఆగ్రహం
టీనా శ్రావ్య తల్లి వివరణ
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


