
📌 Key Points
- హనుమాన్ చాలీసాను గుక్కతిప్పుకోకుండా పఠించిన హీరోయిన్ అదా శర్మ!
- అదా శర్మ పక్కన బాలుడు నోటితో మ్యూజిక్.. వీడియో వైరల్!
- ది కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అదా శర్మ.
- ఆంజనేయుడి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పఠించిన అదా శర్మ.
టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె తన నటనతో కాదు, భక్తితో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
బ్రీత్ లెస్ చాలీసా పఠించిన అదా శర్మ
టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008 సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అదా శర్మ, ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ అటాక్ సినిమాలో హయాతి పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి ఎన్నో సినిమాలు చేసింది అదా శర్మ. అయితే ఆమె తాజాగా హనుమాన్ చాలీసా ( Hanuman Chalisa) పఠించి అందరినీ ఆకట్టుకుంది.
ఆంజనేయుడి జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పఠించింది హీరోయిన్ అదా శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అటు అదా శర్మ పక్కన ఉన్న బాలుడు నోటితో మ్యూజిక్ ఇచ్చాడు. అదే సమయంలో బ్రీత్ లెస్ చాలీసాను హీరోయిన్ అదా శర్మ చదవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
నోటితో మ్యూజిక్ అందించిన బాలుడు
ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. తమ ప్రయత్నం హనుమంతుడని మెప్పిస్తుందని అనుకుంటున్నట్లు అదా శర్మ పేర్కొన్నారు. కాగా తెలుగులో అరడజన్ కు పైగా సినిమాలు చేసిన అదా శర్మ ది కేరళ స్టోరీ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంగతి తెలిసిందే.
వైరల్ అవుతున్న అదా శర్మ వీడియో
A post shared by Adah Sharma (@adah_ki_adah)
అదా శర్మ హనుమాన్ చాలీసా పఠించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


