|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aditya Dhar: ఇకనుంచి అలాగే చేస్తా.. హృతిక్ కామెంట్స్ పై స్పందించిన దర్శకుడు

Published: 13-12-2025, 5:08 AM
Aditya Dhar: ఇకనుంచి అలాగే చేస్తా.. హృతిక్ కామెంట్స్ పై స్పందించిన దర్శకుడు
  • ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘దురంధర్’ చిత్రం రూ.27 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • హృతిక్ రోషన్ మొదట దురంధర్ రాజకీయ అంశాలపై అసమ్మతి తెలిపారు.
  • తర్వాత హృతిక్ తన కామెంట్స్ పై స్పందించి సినిమాను ప్రశంసించారు.
  • దురంధర్ సీక్వెల్ కోసం అందరి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఆదిత్య ధర్ తెలిపారు.

దురంధర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇటీవల హృతిక్ రోషన్ ఈ సినిమాలోని రాజకీయ అంశాలపై మొదట అసమ్మతి తెలిపారు, ఆ తర్వాత సినిమాను ప్రశంసించారు. దీనిపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు. సినిమా సీక్వెల్‌కు అందరి సూచనలు తీసుకుంటానని ఆయన ప్రకటించారు.

దురంధర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం

Aditya Dhar; బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar) తెరకెక్కించాడు. దీంతో, ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో, కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ మూవీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం ఏడూ రోజ్జుల్లోనే రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో, రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Mowgli Review: మోగ్లీ 2025 రివ్యూ: అడవి నేపధ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమకథ.. ఎలా ఉందంటే?

హృతిక్ రోషన్ కామెంట్స్, ట్రోలింగ్

అయితే, రీసెంట్ గా దురంధర్ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. “సినిమా విషయం పక్కన పెడితే.. అందులో చూపించిన రాజకీయ అంశాలను నేను అంగీకరించను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో హృతిక్ పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. చాలా మంది ఆయన కామెంట్స్ ని వ్యతిరేకిస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించిన హృతిక్ రోషన్ దురంధర్ సినిమా నా హృదయానికి హత్తుకుంది. ఆదిత్య సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు” అంటూ రాసుకొచ్చాడు.

దర్శకుడు ఆదిత్య ధర్ స్పందన, సీక్వెల్ ప్లాన్స్

ఇక హృతిక్ చేసిన ఈ పోస్ట్ పై దర్శకుడు ఆదిత్య ధర స్పందించాడు.. ‘సినిమాపై మీరు చూపించిన ప్రేమకు నా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు వందశాతం కష్టపడ్డారు. మీ ప్రశంసలకు అందరూ అర్హులే. దురంధర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. అది తెరకెక్కించేటప్పుడు ప్రతీఒక్కరి సూచనలను తీసుకొని, వాటిని పరిగణంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం”అంటూ రాసుకొచ్చాడు. దీంతో, దర్శకుడు ఆదిత్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హృతిక్ రోషన్ కామెంట్స్‌పై ఆదిత్య ధర్ స్పందన ప్రస్తుతం వైరల్ అవుతోంది. భవిష్యత్తులో వచ్చే దురంధర్ సీక్వెల్ మరింత మెరుగ్గా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు. ఇది సినిమా అభిమానులకు శుభవార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.