|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Adivi Sesh: ఈ ఏడాదీ లేనట్లే.. ప్రేక్షకులు మర్చిపోతున్నారు!

Published: 06-10-2025, 11:54 AM

అడివి శేష్ అభిమానులు అతని కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 2022లో ‘హిట్ 2’ తర్వాత మళ్లీ పెద్ద తెరపై కనిపించని శేష్, ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ‘డకాయిట్’, ‘గూఢచారి 2’ ఆలస్యం అవుతున్నాయి. ప్రేక్షకులు మర్చిపోయేలోపే సినిమాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

Key Points

1

అడివి శేష్ చివరి చిత్రం 'హిట్ 2' 2022 డిసెంబరులో విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది.

2

'డకాయిట్' ఈ ఏడాది క్రిస్మస్‌కు రావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు సమాచారం.

3

శేష్ గాయం కారణంగా షూటింగ్ పూర్తికాక 'డకాయిట్' ఆలస్యం అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

4

'డకాయిట్' వాయిదాతో వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన 'గూఢచారి 2' కూడా ఆలస్యం కావచ్చు.

మూడేళ్లుగా శేష్ సినిమా లేదు?

అడివి శేష్.. ఈ పేరు వినిపించి, స్క్రీన్‌పై ఇతడిని చూసి చాలా ఏళ్లయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ హిట్టో ఫ్లాఫో సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇతడు మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క మూవీని కూడా తీసుకురావట్లేదు. ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ఈసారి కూడా పలు కారణాల వల్ల హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.

క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇలా వరస సినిమాలతో శేష్.. సక్సెస్ అందుకున్నాడు. మరి కారణాలేంటో తెలీదు గానీ 2022 డిసెంబరులో హిట్ 2 రిలీజైంది. తర్వాత గూఢచారి, డకాయిట్ అనే చిత్రాల్ని ప్రకటించాడు. అప్పటినుంచి అవి సెట్స్‌పైనే ఉన్నాయి. లెక్క ప్రకారం ‘డకాయిట్’ మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. తొలుత శ్రుతిహాసన్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ శ్రుతి ప్లేసులోకి మృణాల్ ఠాకుర్ వచ్చింది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడిది వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

‘డకాయిట్’, ‘గూఢచారి 2’ ఆలస్యానికి కారణాలు

శేష్ గతంలో ఓసారి గాయపడ్డాడు. అయితే అది ఇంకా తగ్గే దశలో ఉందని, దీంతో షూటింగ్స్ పూర్తవక ‘డకాయిట్’ వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా టీమ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన ‘గూఢచారి 2’ కూడా కచ్చితంగా వాయిదా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?

ప్రేక్షకులు మర్చిపోకముందే సినిమా రిలీజ్ చేయాలి

శేష్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. లేదంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. మళ్లీ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో హడావుడి చేసినా సరే ఎవరా హీరో అని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చి శేష్.. హిట్ కొట్టాల్సిన అవసరముంది!

శేష్ మంచి నటుడే అయినప్పటికీ, వరుసగా సినిమాలు చేయకపోతే ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వీలైనంత త్వరగా ‘డకాయిట్’, ‘గూఢచారి 2’ చిత్రాలను విడుదల చేసి, తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.