|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘డెకాయిట్’ సినిమా విషయంలో అడివి శేష్ షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే?

Published: 02-12-2025, 9:10 AM
  • అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తున్నారు.
  • భాష ఒక భావోద్వేగమని, డబ్బింగ్‌లో ఎమోషన్స్ మిస్ అవుతాయని శేష్ అభిప్రాయం.
  • తెలుగు, హిందీ భాషల్లో ‘డెకాయిట్’ చిత్రాన్ని విడివిడిగా షూట్ చేయాలని శేష్ నిర్ణయం.
  • ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని సినీ ప్రియులు ప్రశంసిస్తూ షాక్ అవుతున్నారు.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ చిత్రం విషయంలో శేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు, హిందీలలో వేర్వేరుగా షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. భాష ఒక భావోద్వేగమని, డబ్బింగ్ చేస్తే ఎమోషన్స్ మిస్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాహసానికి సినీ ప్రియులు ప్రశంసిస్తున్నారు.

అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీ ప్లాన్

అడివి శేష్(adivi sesh), మృణాల్ ఠాకూర్(mrunal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(decoit). ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌ను షానీల్ డియో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడక నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎన్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా.. ఈ సమయంలో.. అడివి శేష్ మేకింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘నా దృష్టిలో భాష అనేది కేవలం ఒక మాధ్యమం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం.

ఒక కథను అనువందించినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి తప్పనిసరిగా మిస్ అవుతుంది. సినిమాలోని ఎమోషన్స్, కథ, సరిగ్గా చూపించలేం. అందుకే భారీ చిత్రాలు చేసేటప్పుడు డబ్బింగ్ రావపోవచ్చు. అందుకే నేను ‘డెకాయిట్’ను తెలుగు సినిమానే హిందీలో డబ్ చేయకుండా విడివిడిగా షూట్ చేస్తున్నాను. కొన్ని ఎమోషన్స్ చాలా బలంగా ఉండాలని.. అవి సహజంగా లేకుంటే ఆడియన్స్ కనెక్ట్ అవలేరు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే స్ట్రయిట్ లాంగ్వేజ్‌లోనే షూట్ చేయడం నాకు ఇష్టం’’ అని అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. అంత ఓపికతో షూట్ చేయడం గ్రేట్ అని పొగుడుతున్నారు. అలాగే ఏ హీరో చేయని సాహసం చేస్తున్నారని అంటున్నారు.

భాష ఒక భావోద్వేగం: శేష్ అభిప్రాయం

డబ్బింగ్‌కు బదులు రీ-షూట్ వెనుక కారణం

అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం కోసం తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులను భావోద్వేగంగా కనెక్ట్ చేసేందుకు ఆయన పడిన తపన అభినందనీయం. ఈ చర్య భవిష్యత్తు చిత్ర నిర్మాణానికి కొత్త మార్గదర్శనం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.