
📌 Key Points
- టాలీవుడ్‌లో ఏఐ టెక్నాలజీ వాడకంపై దుమారం!
- నిఖిల్ సంచలన ట్వీట్: ఏఐ వాడకంపై హాట్ టాపిక్!
- నాగబంధం, రాజాసాబ్, మార్తాండ్‌లో ఏఐ విజువల్స్?
- ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ సినిమాల్లోనూ ఏఐ హవా?
టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం. పలు సినిమాల్లో ఏఐ వాడటం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఏఐ వాడుతున్నారా లేదా?
TollyWood : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏఐ పంచాయితీ బాగానే నడుస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన పలు మూవీస్ టీజర్లు, ట్రైలర్లు చూస్తే ఏఐని యూజ్ చేసినట్లు కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అసలు తమ సినిమాల్లో ఏఐ వాడటం లేదని మేకర్స్ చెబుతుండటం చర్చకు దారితీస్తోంది.
పెద్ద బడ్జెట్, విజువల్ గ్రాండీయర్‌గా వస్తున్న సినిమాలు చాలా వరకు ఏఐ ని బాగానే వాడుకుంటున్నాయి. అయితే ఇది ఒప్పుకోకుండా..VFXతో చేశామంటున్నారు. ఇటీవల హీరో నిఖిల్ చేసిన ట్వీట్ పెద్ద చర్చకే దారితీస్తుంది. రీసెంట్‌గా వచ్చిన ఓ సినిమాలోలాగా తమ మూవీలో ఏఐ వాడలేదంటూ నిఖిల్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
నిఖిల్ ట్వీట్ వెనుక అసలు కథ
రీసెంట్‌గా వచ్చిన ఆ మూవీ ఏంటి.? నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. విజువల్ పరంగా ఏఐ ఎక్కువగా వాడిన మూవీస్ ఏంటా? అంటూ సెర్చ్ చేస్తున్నారు.
ఏఐతో ఖర్చు తగ్గుతుందా?
అసలు తమ సినిమాకు ఏఐ వాడలేదని, వేరే సినిమాలకు వాడారని నిఖిల్ కామెంట్ చెయ్యటంతో మిగతా సినిమా వాళ్లు కాస్త గరం గరంగా వున్నారు. అయితే ఏఐ వాడినంత మాత్రాన ఏం అవుతుందంటుని మరికొందరు మేకర్స్ ప్రశ్నిస్తున్నారు. ఏఐ వాడితే ఖర్చు తగ్గుతుంది. వర్క్ స్పీడ్‌గా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏఐ వాడొచ్చని అంటున్నారట. ఇటీవల రిలీజ్ అయిన నాగబంధం ట్రైలర్, రాజాసాబ్, మార్తాండ సినిమాల్లో ఏఐ వాడకం కనిపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెద్ద స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, నాని నటిస్తున్న సినిమాల్లో కూడా ఏఐని బాగానే వాడుతున్నట్లు టాక్ నడుస్తుంది.
ఏది ఏమైనా టాలీవుడ్‌లో ఏఐ వాడకంపై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


