|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అజిత్‌ సంచలన నిర్ణయం.. ఆ టైమ్‌లో సినిమాలకు బ్రేక్‌

Published: 18-05-2025, 11:12 AM
అజిత్‌ సంచలన నిర్ణయం.. ఆ టైమ్‌లో సినిమాలకు బ్రేక్‌

కోలీవుడ్‌ స్టార్ అజిత్‌ ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` సినిమాతో విజయం సాధించారు. అయితే రేసింగ్‌లో వరుస ప్రమాదాల తర్వాత ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు బ్రేక్‌ ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం విశేషం.

Key Points

1

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో విజయం సాధించారు.

2

కార్ రేసులో విజేతగా నిలిచారు, కానీ వరుస ప్రమాదాలకు గురయ్యారు.

4

రేసింగ్ సీజన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

అజిత్‌ యొక్క తాజా విజయాలు

కోలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌, యాక్షన్‌ హీరో‌ అజిత్‌ ఇటీవలే `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. `పట్టుదల` వంటి ఫ్లాప్‌ తర్వాత ఆయనకు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. అభిమానులను ఖుషీ చేసింది. అంతేకాదు ఇటీవల అజిత్‌ కార్‌ రేసులో పాల్గొని విన్నర్‌గానూ నిలిచారు. ఇలా అటు సినిమాలు, ఇటు రేసింగ్‌లో సక్సెస్‌ సాధించి మంచి జోష్‌లో ఉన్నారు అజిత్‌.

అజిత్‌ ఇటీవల రెండు మూడు దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని విన్నర్‌గా నిలవడం విశేషం. అంతేకాదు వరుసగా యాక్సిడెంట్లకి కూడా గురయ్యారు. రెండు మూడు నెలల్లోనే ఆయన కారు మూడు సార్లు ప్రమాదానికి గురైంది.

ఈ క్రమంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు అజిత్‌. సినిమాలకు బ్రేక్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. సినిమాలు, రేసింగ్‌ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని, అందుకే రేసింగ్‌ ఉన్న టైమ్‌లో సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.

రేసింగ్‌లో ప్రమాదాలు

అజిత్‌ మాట్లాడుతూ, రేసింగ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, రేసింగ్‌కి ఫిట్‌నెస్‌ ఎంతో అవసరమని, చాలా రోజుల తర్వాత కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా ఫిట్ గా మారాలని అర్థమైందన్నారు.

స్విమ్మింగ్, సైక్లింగ్‌తోపాటు ఇతర వర్కౌట్లు, డైట్‌ చేశానని గత ఎనిమిది నెలల కాలంలో సుమారు 42 కిలోల బరువు తగ్గినట్టు వెల్లడించారు అజిత్‌. రేసింగ్‌, సినిమా ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని, దాని వల్ల ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చిందన్నారు.

రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు అజిత్‌. `రేసింగ్‌ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిజం చెప్పాలంటే నా సినిమాల్లో స్టంట్స్ నేనే చేస్తా. దాని వల్ల నాకెన్నో సర్జరీలు జరిగాయి.

సినిమాలకు బ్రేక్‌ – అజిత్‌ ప్రకటన

అలా అని యాక్షన్‌ సినిమాలు వదిలేయలేను కదా. అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కి కూడా దూరం కాలేదు. నా దృష్టిలో ఈ రెండు ఒకే లాంటివి` అని అజిత్‌ వెల్లడించారు. తన కొత్త ప్రాజెక్ట్ నవంబర్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు అజిత్‌. ఆయన నిర్ణయం అభిమానులను కొంత నిరాశ పరుస్తుందని చెప్పొచ్చు.

అజిత్‌ తీసుకున్న సంచలన నిర్ణయం అభిమానులను నిరాశపరిచింది. అయితే ఆయన రేసింగ్‌లో రాణించాలనే తపనను మనం గుర్తించాలి. భవిష్యత్తులో మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై మనం ఆయన్ని చూడొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.