|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ 2 నుంచి బిగ్ అప్డేట్… ఇక తాండవమే

Published: 07-06-2025, 9:14 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా తాజా అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. రేపు ఉదయం 10:54 గంటలకు క్రేజీ అప్డేట్ విడుదల కానుంది. బాలయ్యబాబు తాండవం ప్రారంభం కానుంది.

Key Points

1

అఖండ 2 సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రేపు ఉదయం 10:54 గంటలకు విడుదల కానుంది.

2

బాలయ్యబాబు తాండవం ప్రారంభం కాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.

4

దసరా కానుకగా అఖండ 2 సినిమా విడుదల కానుందని అంచనా.

అఖండ 2 నుంచి తాజా అప్డేట్

నందమూరి బాలయ్య, సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో లేటెస్ట్ మూవీ అఖండ 2. గతంలో వచ్చిన అఖండ సినిమాకు… దీన్ని సీక్వెల్ గా తీస్తున్నారు బోయపాటి శ్రీను. శరా వేగంగా షూటింగ్ జరుపుకున్న అఖండ 2 సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. బాలయ్య తాండవం ప్రారంభం కాబోతుంది అంటూ… కీలక ప్రకటన చేసింది చిత్ర బృందం.

అంతేకాదు రేపు ఉదయం 10:54 గంటలకు.. క్రేజీ అప్డేట్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది. దీంతో రేపు ఉదయం అఖండ 2 సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అని… ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏదైతేనేం… బాలయ్య సినిమా నుంచి రేపు అప్డేట్ వస్తుందని ప్రకటన రావడంతో…. అభిమానులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట తెరకెక్కిస్తున్నారు.

రేపు ఉదయం క్రేజీ అప్డేట్ రిలీజ్

అలాగే ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అలాగే.. ఈ సినిమాకు ఎప్పటిలాగే తమన్ ఊర మాస్ మ్యూజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే… బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ అలాగే అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల కంటే… ఒక మెట్టు ఎక్కువగానే అఖండ 2 సినిమా ఉంటుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.

బాలయ్యబాబు తాండవం ప్రారంభం

THE THAANDAVAM BEGINS ❤️‍🔥 #Akhanda2 massive update tomorrow at 10.54 AM 🔱🔥 ‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri pic.twitter.com/SLN5zcZUot

అఖండ 2 సినిమా నుంచి వచ్చే అప్డేట్‌ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.