
📌 Key Points
- బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయం సాధించింది.
- అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్న నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు.
- 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 93 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
- జీఎస్టీ చెల్లించలేకపోవడంతో బయ్యర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, అఖండ 2 మాత్రం ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోయారని సమాచారం. జీఎస్టీ కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.
అఖండ విజయం, అఖండ 2 ఆశలు
Akhanda 2: బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసేస్, నందమూరి బాలకృష్ణ (Balakrishna ) నటించిన చిత్రం ‘అఖండ’ . ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుని.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో బాలయ్య పెర్ఫార్మన్స్ కి సినిమా థియేటర్లు దద్దరిల్లాయి.ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత అదే జోష్ తో అఖండ 2 సినిమాను గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు . పైగా ఈ సినిమా టికెట్ల పెంపుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ అనుమతి లభించింది. పక్కా ప్రణాళికతో ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చిన మొదటి షో మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో లాభాలు రాలేదు. పైగా నిర్మాతకు నష్టాలే మిగిలాయి.
ఆ నష్టాలతో 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ నిలిచిన చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. పైగా ఈ సినిమా కోసం 14 రీల్స్ ప్లస్ సంస్థ 200 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అయితే ఈ సినిమాకి మాత్రం భారీగా నష్టాలు వచ్చాయనే చెప్పాలి. దీనికి తోడు సంక్రాంతి సినిమాల సందడి ఏర్పడడంతో చాలావరకు అఖండ 2 సినిమాని థియేటర్ల నుంచి తొలగించారు. ఇక అప్పటివరకు ఈ సినిమా 93 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు రాగా.. ఫుల్ రన్ ముగిసేసరికి నిర్మాతలకు రూ.100 కోట్ల మేరా నష్టాలు మిగిలినట్లు వార్తలు వినిపించాయి. కారణం ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతోనే కలెక్షన్ల పై ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అయితే అభిమానులకు విపరీతంగా నచ్చినా.. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ జనాలకి కూడా అంతగా కనెక్ట్ కాలేదని చెప్పాలి.
నిర్మాతలకి భారీ నష్టాలు
ఇకపోతే ఈ సినిమాను బిజినెస్ పరంగా చూడకూడదని దర్శకుడు బోయపాటి కొన్ని రోజుల క్రితం కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి డబ్బులు సమస్య లేదంటూనే కావాల్సినంత కలెక్షన్స్ ఎప్పుడో వచ్చేసాయని తెలిపారు. పైగా అఖండ 2 సినిమాకు డబ్బులు ఎప్పుడో వచ్చేసాయి.. నష్టాలేమి లేవంటూ సంబరపడుతూ పోస్టులు పెట్టారు. కానీ బయ్యర్ల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అఖండ 2 కి సంబంధించిన జీఎస్టీలు ఇస్తే కాస్తయినా నష్టాలు తగ్గుతాయని బయ్యర్లు ఆశగా ఎదురుచూసినా ఇప్పుడు అది కూడా జరగలేదని సమాచారం.
జీఎస్టీ చెల్లింపులో సమస్యలు
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్ర నిర్మాతలైన సోదరులు గోపి ఆచంట , రామ్ ఆచంట ఈ సినిమా నష్టంతో రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బయ్యర్లకు జీఎస్టీ కూడా చెల్లించలేక పోవచ్చు అని, చాలా వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా బాలయ్య సినిమాకి నిర్మాతలు రోడ్డు పైకి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మొత్తానికి అఖండ 2 సినిమా నిర్మాతలకి భారీ నష్టాలను మిగిల్చింది. దీని ప్రభావం బయ్యర్లపై కూడా పడింది. జీఎస్టీ చెల్లింపులు కూడా సాధ్యం కాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.


