|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 : ఏంటి అఖండ 2 రేపు రిలీజ్ అయిపోద్దా? సమస్యలన్నీ తీరినట్టేనా?

Published: 05-12-2025, 1:08 AM
  • అఖండ 2 రిలీజ్ చివరి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందులతో ఆగిపోయింది.
  • తమిళనాడులో ఈరోస్ సంస్థ 28 కోట్ల నష్టాలు కట్టాలని ఉత్తర్వులు తెచ్చుకుంది.
  • ప్రస్తుతం నిర్మాతలు దాదాపు 50 కోట్లు క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
  • మద్రాసు హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే డిసెంబర్ 6న విడుదల సాధ్యం.

బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆర్ధిక ఇబ్బందులు, ఈరోస్ సంస్థతో న్యాయపరమైన సమస్యలు దీనికి కారణం. నేడు మద్రాసు హైకోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది, దీనిపై సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది.

అఖండ 2 విడుదల ఎందుకు ఆగింది?

Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బాలయ్య బాబు అఖండ 2 సినిమా నేడు రిలీజ్ అవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం అఖండ 2 నిర్మాతలపై తమిళనాడులో ఈరోస్ సంస్థ 28 కోట్ల నష్టాలు కట్టాలని అప్పటి వరకు సినిమా ఆపాలని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడమే. అలాగే ఇక్కడ తెలుగులో కూడా ఫైన్షియర్స్ డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టారట.(Akhanda 2)

దీంతో చివరి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందులతో అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు అన్ని కలిపి అఖండ 2 నిర్మాతలు దాదాపు 50 కోట్లు క్లియర్ చేయాలట. నిన్నటి నుంచే నిర్మాతలు ఎంతగానో ప్రయత్నిస్తున్నా అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం కొంత డబ్బు కట్టి, కొంత తర్వాత ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారని, కోర్టుకు కూడా సినిమా రిలీజ్ పర్మిషన్ ఇవ్వాలని వెళ్లారట అఖండ 2 నిర్మాతలు.

నిర్మాతలపై ఆర్ధిక భారం, న్యాయపోరాటం

నేటి కోర్టు తీర్పు, రేపటి రిలీజ్ పై ఉత్కంఠ

మద్రాసు కోర్టులో ఈ కేసు వ్యవహారం తేలితే ఇవాళ రాత్రి ప్రీమియర్ షోలు వేసి రేపట్నుంచి అంటే డిసెంబర్ 6 శనివారం నుంచి అధికారికంగా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి నేడు మద్రాస్ హైకోర్టులో అఖండ 2 నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వస్తుందా, సినిమా రిలీజ్ అవుతుందా లేక వాయిదా తప్పదా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అఖండ 2 విడుదలపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేడు కోర్టు ఇచ్చే తీర్పు, నిర్మాతల ప్రయత్నాలపైనే రేపటి సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. బాలయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.