|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ అక్కినేని – జైనాబ్ పెళ్లి తేదీ…వేదిక ఇదేనా?

Published: 30-05-2025, 1:13 AM
అఖిల్ అక్కినేని - జైనాబ్ పెళ్లి తేదీ...వేదిక ఇదేనా?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జైనాబ్ రవ్జీతో ఆయన వివాహం జూన్ 6న జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్జీల పెళ్లి జూన్ 6న జరుగుతుందని ప్రచారం.

2

అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్‌గా పెళ్లి జరుగుతుందని సమాచారం.

4

నాగార్జున కుటుంబానికి జైనాబ్ కుటుంబంతో పాత పరిచయం ఉంది.

పెళ్లి తేదీ & వేదిక వివరాలు

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇంటివాడు కాబోతున్న‌ట్లు స‌మాచారం. ప్రియురాలి మెడ‌లో త్వ‌ర‌లో మూడుముళ్లు వేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. అఖిల్ అక్కినేని, జైనాబ్ ర‌వ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్లు చెబుతోన్నారు. జూన్ 6న ఈ జంట పెళ్లిపీట‌లుఎక్క‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి డేట్‌ను మాత్రం ఇటు అక్కినేని ఫ్యామిలీ తో పాటు జైనాబ్ ర‌వ్జీ కుటుంబ‌స‌భ్యులు అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

అఖిల్‌, జైనాబ్ లు డెస్టినేష‌న్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అందులో నిజం లేద‌ని, వీరి పెళ్లి అన్న‌పూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా జ‌ర‌గ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే జ‌రిగింది.

జైనాబ్ రవ్జీ ఎవరు?

జైనాబ్ ర‌వ్జీతో చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు అఖిల్ అక్కినేని. వీరి ల‌వ్‌స్టోరీ ఎంగేజ్‌మెంట్‌తోనే బ‌య‌ట‌పడింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో అఖిల్‌, జైనాబ్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను నాగార్జున అభిమానుల‌తో పంచుకున్నాడు. జ‌నాబ్‌ను త‌మ కుటుంబంలోకి కోడ‌లిగా ఆహ్వానించ‌డం ఆనందంగా ఉందంటూ సోష‌ల్ మీడియా లో పోస్ట్ పెట్టాడు.

జైనాబ్ ర‌వ్జీ స్వ‌త‌హాగా ఓ పెయింట‌ర్‌. హైద‌రాబాద్‌లో పుట్టిన ఆమె దుబాయ్‌లో పెరిగింది. సినిమాల్లోనూ న‌టించింది. ఎంఎఫ్ హుస్సేన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే బాలీవుడ్‌ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో జైనాబ్ క‌నిపించింది. జైనాబ్ ఫ్యామిలీతో నాగార్జున కుటుంబానికి చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంది. జైనాబ్ తండ్రి జుల్ఫీ ర‌వ్జీ, నాగార్జున మంచి స్నేహితులు. ఆ అనుబంధ‌మే అఖిల్‌, జైనాబ్ మ‌ధ్య ప్రేమ‌కు దారితీసిన‌ట్లు స‌మాచారం.

అఖిల్ కెరీర్ & వ్యక్తిగత జీవితం

2017లో శ్రియా భూపాల్‌తో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. పెళ్లి పీట‌లు ఎక్క‌కుండానే మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఈ జంట విడిపోయారు. మ‌రోవైపు కెరీర్ ప‌రంగా ఒదిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నారు అఖిల్‌ . ఏజెంట్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో కెరీర్‌కు రెండేళ్ల పాటు బ్రేక్ తీసుకున్నాడు అఖిల్‌. ఇటీవ‌లే లెనిన్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై నాగార్జున స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.

అఖిల్ మరియు జైనాబ్ ల వివాహం త్వరలో జరగబోతుండటంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.