|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’

Published: 11-06-2025, 7:52 AM
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’

తమిళ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే తమిళ బ్లాక్ బస్టర్ ‘డాడా’ సినిమా తెలుగులో ‘పాపా’ పేరుతో విడుదలవుతోంది. కవిన్, అపర్ణా దాస్ నటించిన ఈ సినిమా జూలై 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

తమిళ బ్లాక్ బస్టర్ 'డాడా' తెలుగులో 'పాపా' పేరుతో విడుదల

2

కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రం 13వ తేదీన విడుదల

4

ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాతల ఆశ

‘డాడా’ నుంచి ‘పాపా’కి మార్పు

తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్‌ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్‌ కాబోతున్న తమిళ బ్లాక్‌ బస్టర్‌ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ  చిత్రం  తమిళ్‌లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. “పా పా” చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.

జూలై 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. “డా డా ” సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో “పా పా” పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు.

ప్రముఖుల హాజరైన ట్రైలర్ లాంచ్

ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ – మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ “పా పా”. ఈ చిత్రం తమిళంలో”డా డా ” పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు.

తమిళంలో ఘన విజయం సాధించిన ‘డాడా’ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. ‘పాపా’ సినిమా మంచి విజయం సాధించుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.