
సినిమాల్లో స్టంట్స్ చేసే వారి ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని గుర్తించి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ‘కన్నప్ప శివుడు’ సినిమా స్టంట్ వర్కర్లకు ఇన్సురెన్స్ చేయించారు. ఇటీవల జరిగిన ఒక విషాద ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Key Points
అక్షయ్ కుమార్ 700 మంది స్టంట్ వర్కర్లకు ఇన్సురెన్స్ చేయించారు.
ప్రమాద బీమాలో ఆరోగ్య సమస్యలకు రూ. 5 లక్షలు, మరణానికి రూ. 20-25 లక్షలు భద్రత.
యాక్షన్ డైరెక్టర్స్ గిల్డ్ మరియు స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ సహకారంతో పాలసీలు అమలు.
స్టంట్ మాన్ ఎస్.ఎం. రాజు మరణం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
అక్షయ్ కుమార్ మానవత్వం
సినిమాల్లో స్టంట్ మాస్టర్ల ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్న కాస్తా రిస్కీతో కూడుకున్నది. ఆడియెన్స్‌కు మంచి థ్రిల్ ఇచ్చేందుకు వివిధ రకాలుగా యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తుంటారు. తెర ముందు హీరోలు అదిరిపోయే ఫైట్ సీన్స్ చేస్తున్నారంటే దానికి కారణం తెర వెనుక ఉన్న స్టంట్ మాస్టర్లదే.
అలాంటి స్టంట్ మాస్టర్ల పట్ల బాలీవుడ్ స్టార్ హీరో, కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చేసిన అక్షయ్ కుమార్ మంచి మనసు చాటుకున్నారు. సినిమాల్లో రియల్‌గా స్టంట్స్ చేసి యాక్షన్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్ స్టంట్ మెన్, ఉమెన్స్ పట్ల మంచి నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది.
ఏకంగా 650 మంది స్టంట్ వర్కర్లకు ప్రమాద బీమాను చేయించాడు అక్షయ్ కుమార్ . సుమారు 650 నుంచి 700 మంది స్టంట్ మాస్టర్స్‌కు వ్యక్తిగత ఇన్సురెన్స్ సదుపాయం కల్పించారు అక్షయ్ కుమార్. ఈ బీమా తీసుకున్న వారికి ఆరోగ్య సమస్యలకు రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ. 20 నుంచి 25 లక్షల వరకు భద్రత కల్పించేలా పాలసీలను తీసుకున్నారు అక్షయ్ కుమార్.
స్టంట్ వర్కర్లకు భద్రత
యాక్షన్ డైరెక్టర్స్ గిల్డ్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ సమన్వయంతో ఈ పాలసీలను అమలు చేయనున్నారు. గుంజన్ సక్సేనా, అంతిమ్, ఓఎంజీ 2, జిగ్రా, ధడక్ 2 వంటి చిత్రాలకు పనిచేసిన సీనియర్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ దహియా ఈ విషయాన్ని ప్రకటించారు.
అయితే, ఇటీవల డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన వెట్టువమ్ తమిళ సినిమా సెట్‌లో స్టంట్ మెన్ ఎస్ఎం రాజు మరణించిన విషయం తెలిసిందే. వెట్టువం సినిమా షూటింగ్‌లో భాగంగా కారు బోల్తా కొట్టే సీన్‌లో పాల్గొన్న స్టంట్ మాస్టర్ రాజు గుండెపోటుకు గురయ్యారు.
కన్నప్ప శివుడు సినిమా
దాంతో చికిత్స కోసం మూవీ టీమ్ సమీపంలోని ఆస్పత్రికి ఎస్ఎం రాజును తీసుకెళ్లేలోపే ఆయన మరణించారు. ఎస్ఎం రాజు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎస్ఎం రాజు మరణంతో అక్షయ్ కుమార్ ఇలా ప్రమాద బీమా పాలసీ చేయించినట్లుగా తెలిసింది. దీంతో అక్షయ్ కుమార్ మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ యాక్షన్ చేసే అక్షయ్ కుమార్ రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.
స్టంట్ మాన్ మరణం తర్వాత అక్షయ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో మంచి మార్పును తీసుకువస్తుందని ఆశిద్దాం. అతని మంచి మనసు అందరికీ స్ఫూర్తి.


