
📌 Key Points
- తారకరత్న మరణం తర్వాత అలేఖ్య మొదటిసారి ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు.
- పూజలో కుంకుమ పెట్టుకోవద్దని అన్నప్పుడు గుండె పగిలిపోయిందని అలేఖ్య ఎమోషనల్ కామెంట్స్.
- ఇంట్లో వాళ్ళే డిఫరెన్స్ చూపించడంతో ఇకపై ఫంక్షన్స్ కి వెళ్లకూడదని నిర్ణయించుకున్న అలేఖ్య.
- వితంతువుల గురించి సమాజంలో ఉన్న ఆలోచనలపై అలేఖ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ లో విషాదం! తారకరత్న గారి మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య గారు మొదటిసారిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె ఎన్నో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కుంకుమ పెట్టుకోవద్దనడంతో షాక్!
Alekhya : హీరో తారకరత్న 2023లో మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణంతో ఆయన భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ తారకరత్న భార్య అలేఖ్య సోషల్ మీడియాలో ఆయన్ని తలుచుకుంటూ పోస్టులు చేస్తూనే ఉంటారు.
తారకరత్న మరణం తర్వాత మొదటిసారి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలు మాట్లాడింది. అలాగే తారకరత్న మరణించాక తను ఫేస్ చేసిన పలు ఇబ్బందుల గురించి కూడా తెలిపింది.
ఫంక్షన్స్ కి వెళ్లకూడదని నిర్ణయం!
అలేఖ్య మాట్లాడుతూ.. ఆయన లేరు అని నేను ఒక్కోసారి యాక్సెప్ట్ చేయలేను. కానీ కొంతమంది ఇంకా గుర్తుచేస్తారు. ఓ పూజలో సడెన్ గా చెయ్యి పట్టుకొని నువ్వు కుంకుమ పెట్టుకోకు, నువ్వు హారతి ఇవ్వకు అని ఆపేసినప్పుడు గుండె పగిలిపోయింది. అప్పుడు నేను చాలా ఏడ్చాను. మా ఇంట్లో వాళ్ళు అలాంటి డిఫరెన్స్ చూపించారు. కానీ బయట సొసైటీ అలాగే చూస్తుంది. అలా జరగడంతో ఆ తర్వాత ఇంకెప్పుడు పూజలకు, ఫంక్షన్స్, పెళ్లిళ్లకు వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. పిలవద్దు అని కూడా చెప్పాను.
వితంతువుల పట్ల సమాజం తీరుపై అసహనం!
నేను అంతకుముందు ఇప్పుడు ఒకే దేవుడ్ని పూజిస్తున్నాను. అలాంటిది బొట్టు పెట్టుకోవద్దు అని చెప్పడం ఏంటో. రూల్ బుక్ ఏమైనా ఉందా విడోస్ ఇలాగే ఉండాలి అని. ఆ పదం వాడటం కూడా పెయిన్ ఇస్తుంది అంటూ ఎమోషనల్ అయింది.
అలేఖ్య గారు చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ధైర్యానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


