
📌 Key Points
- తారకరత్న మరణంతో అలేఖ్య, పిల్లలు విషాదంలో, జీవితం కష్టంగా మారింది!
- కూతురు నిష్కకు పానిక్ అటాక్స్.. తండ్రిని గుర్తు చేసుకుంటూ తీవ్ర వేదన!
- స్కూల్ నుండి వచ్చాక తండ్రి ఫోటోను హత్తుకుని ఉత్తరాలు రాస్తున్న నిష్క!
- పేరెంట్స్ మీటింగ్ కు ఒంటరిగా వెళ్లిన అలేఖ్య.. నాన్న లేడని అడుగుతున్న చిన్నారి రేయ!
టాలీవుడ్ నటుడు తారకరత్న మరణం తర్వాత ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన భార్య అలేఖ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తారకరత్న మరణం తర్వాత అలేఖ్య పరిస్థితి!
Alekhya Tarakratna : హీరో తారకరత్న 2023లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత భార్య అలేఖ్య ఎక్కువగా బయట కనిపించలేదు. తను, ముగ్గురు పిల్లలే తన జీవితం అని గడిపేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు పెడుతుంది. తారక్ మరణం తర్వాత మొదటిసారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య.
ఈ ఇంటర్వ్యూలో అలేఖ్య అనేక విషయాలు మాట్లాడగా తన పిల్లల గురించి కూడా మాట్లాడింది. నాన్న లేరు అనే విషయాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. తారకరత్న – అలేఖ్య జంటకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు నిష్కా కు 12 ఏళ్ళు. ఆ తర్వాత ఇద్దరు కవలపిల్లలు. ఒక బాబు, పాప. ఇద్దరికీ ఆరేళ్ళు. పాప రేయ, బాబు తనయ్ రామ్.
కూతురు నిష్క పానిక్ అటాక్స్.. కారణం అదేనా?
పిల్లల గురించి అలేఖ్య మాట్లాడుతూ.. వాళ్ళు ఎప్పుడూ ఓబు(తారకరత్న)ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. నిష్క కు పానిక్ అటాక్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు తండ్రిని తలుచుకొని. రోజూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నిష్క ఆయన ఫోటోని హగ్ చేసుకుంటుంది. ఆయన లేకపోయినా ఉత్తరాలు రాసి ఆ ఫోటో దగ్గర పెడుతుంది. ఓబు చదువుతాడని చెప్తుంది. నిష్క మాట్లాడటానికి ఇష్టపడకపోయినా రోజూ తలుచుకుంటుంది.
పిల్లల గురించి చెబుతూ ఎమోషనల్ అయిన అలేఖ్య!
చిన్న పిల్లలు ఇద్దరూ కూడా గుర్తు చేసుకుంటారు. స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ కి అందరికి అమ్మానాన్నలు వస్తే, నేను ఒక్కదాన్నే వెళ్తే రెయా నాన్న లేడు అని అడుగుతుంది అని చెప్తూ ఎమోషనల్ అయింది.
అలేఖ్య తన పిల్లల గురించి ఎంతో బాధగా మాట్లాడారు. ఆమె ధైర్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుందాం. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


