|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Alia Bhatt: ‘ఇదేం మీ ఇల్లు కాదు.. ముందు బయటికి వెళ్లండి’.. ఆలియా భట్‌ ఆగ్రహం

Published: 14-08-2025, 11:15 PM
Alia Bhatt: 'ఇదేం మీ ఇల్లు కాదు.. ముందు బయటికి వెళ్లండి'.. ఆలియా భట్‌ ఆగ్రహం

బాలీవుడ్ నటి ఆలియా భట్ తన నివాసంలో పాడిల్ బాల్ ఆడుతుండగా ఫోటోగ్రాఫర్లు వెంటాడారు. వారి వేధింపులకు ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

పాడిల్ బాల్ ఆడుతున్న ఆలియాను ఫోటోగ్రాఫర్లు వేధించారు.

2

ఆలియా భట్ వారిని తీవ్రంగా మందలించింది.

4

ఆలియా త్వరలోనే 'ఆల్ఫా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాపరాజీల వేధింపులు

బాలీవుడ్ భామ ఆలియా భట్ ‌ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది . ఈ ఏడాది ‍ అల్ఫా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది . గతేడాది వచ్చిన జిగ్రా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది . దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు . ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ ‌ బ్యానర్ ‌ లో తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రానికి శివ్‌ రావేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు . అయితే షూటింగ్ ‌ లకు కాస్తా విరామం దొరకడంతో ఆలియా భట్ ‌ ఫిట్ ‌ నెస్ ‌ కోసం కసరత్తులు చేస్తోంది . ముంబయిలోని తన నివాసం వద్ద పాడిల్ ‌ బాల్ ‌ ఆడుతూ కనిపించింది . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ ‌ గా మారింది .

ఆలియా ఆగ్రహం

అయితే అంతకుముందే పాడిల్ బాల్ ఆడేందుకు వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు . ఆమెను ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు . ఏకంగా ఆలియాతో పాటే బిల్డింగ్ ‌ లోపలికి వెళ్లేందుకు యత్నించారు . దీంతో ఆలియా భట్ ‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది . లోపలికి రావొద్దు .. దయచేసి బయటికి వెళ్లండి .. ఇది మీ భవనం కాదు అంటూ మండిపడింది . ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది . అయినా సెలబ్రిటీలను ఫోటోల కోసం ఇలా వెంటపడి వేధించడం సరికాదని కొందరు నెటిజన్స్ ‍ కామెంట్స్ చేస్తున్నారు . వారికి పర్సనల్ ‌ లైఫ్ ‌ ఉంటుందని .. ఇలా ఇబ్బంది పెట్టపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు . ఇలా చేసేవారికి కొంతైనా కామన్ సెన్స్ ఉండాలని .. సెలబ్రిటీలను బాధపెట్టడం సరికాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు .

నెటిజన్ల స్పందన

కాగా .. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్‌ క్రియేట్‌ చేయనుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనుంది.

సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారి ప్రైవసీని గౌరవించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆలియా భట్ త్వరలో విడుదల కానున్న ఆల్ఫా సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.