|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ నీల్ మూవీలో ఆలియా భట్.. టాలీవుడ్‌లో దుమ్ము రేపే పవర్ ఫుల్ రోల్!

Published: 14-04-2026, 2:05 AM
ఎన్టీఆర్ నీల్ మూవీలో ఆలియా భట్.. టాలీవుడ్‌లో దుమ్ము రేపే పవర్ ఫుల్ రోల్!
  • ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఆలియా భట్ కోసం పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేసిన ప్రశాంత్ నీల్ అట!
  • ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి టాలీవుడ్‌లో ఆలియా మెరుపు, ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం!
  • రుక్మిణి వసంత్ హీరోయిన్ అయినా ఆలియా పాత్రకు సినిమాలో కీలక ప్రాధాన్యత ఉంటుందట!
  • బాలీవుడ్‌లో ‘అల్ఫా’తో పాటు టాలీవుడ్‌లో ఎన్టీఆర్ మూవీతో ఆలియా హవా కొనసాగడం ఖాయం!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది నిజంగా పండగే! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ త్వరలోనే ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్-నీల్ కాంబోలో ఆలియా సందడి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గతేడాది ‘జిగ్రా’ వంటి సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘అల్ఫా’ అనే పవర్‌ఫుల్ స్పై థ్రిల్లర్‌లో నటిస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఈ మొదటి ఫిమేల్ లీడ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ జరుపుకుంటున్ప ఈ సినిమా జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆలియా భట్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తెలుగు పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీతగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఎన్టీఆర్-నీల్’ (డ్రాగన్) సినిమాలో ఆలియా భట్‌ను ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం సంప్రదించారట. ఇందులో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నప్పటికీ, ఆలియా కోసం ఒక కీలకమైన, కథను మలుపు తిప్పే పాత్రను నీల్ డిజైన్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఆలియా, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉండటంతో ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆలియా ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు. ‘అల్ఫా’తో బాలీవుడ్‌ను, ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్‌ను ఆలియా ఏలేయడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు బాలీవుడ్‌లో ‘లవ్ అండ్ వార్’, ‘జీ లే జరా’ వంటి సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి సౌత్ ఇండియన్ పాన్ ఇండియా సినిమాల్లో భాగమవ్వడం ఆలియా క్రేజ్‌ను మరింత పెంచుతోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి తెలుగు తెరపై ఆలియా!

ఆలియా కోసం పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేసిన నీల్!

ఆలియా భట్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.