|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ డైరెక్టర్‌తో అల్లరి నరేష్ సరికొత్త సినిమా.. కిక్కెంచే టైటిల్‌గా ఆల్కహాల్.. హీరోయిన్‌గా మత్తెక్కించే హాట్ బ్యూటీ!

Published: 30-06-2025, 3:14 AM
ఓటీటీ డైరెక్టర్‌తో అల్లరి నరేష్ సరికొత్త సినిమా.. కిక్కెంచే టైటిల్‌గా ఆల్కహాల్.. హీరోయిన్‌గా మత్తెక్కించే హాట్ బ్యూటీ!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో అల్లరి నరేష్ నటించిన కొత్త సినిమా ‘ఆల్కహాల్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.

Key Points

1

అల్లరి నరేష్ కొత్త సినిమా 'ఆల్కహాల్' ఓటీటీలో విడుదల కానుంది.

2

'ఫ్యామిలీ డ్రామా' ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

4

గిబ్రాన్ సంగీతం, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ.

అల్లరి నరేష్ కొత్త సినిమా వివరాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిధ్యభరితమైన చిత్రాలతో సంచలన విజయాలను అందుకుంటోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ మూడు సంస్థలు కలిసి మరో విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నాయి. హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ విభిన్న సినిమాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.

అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు హీరో అల్లరి నరేష్. ‘ ఫ్యామిలీ డ్రామా ‘ మూవీ ఫేమ్ మెహర్ తేజ్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో అక్టోబర్ 29న థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఫ్యామిలీ డ్రామా చిత్రం మంచి ఆదరణ పొందింది.

‘ఆల్కహాల్’ సినిమా టీమ్

అలాంటి ఓటీటీ డైరెక్టర్ మెహర్ తేజ్‌తో అల్లరి నరేష్ సినిమా వస్తోంది. ఈ సినిమాకు కిక్కెంచేలా ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆల్కహాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆల్కహాల్‌లో మునిగిపోయిన దృశ్యం చూడొచ్చు.

ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటి రుహాని శర్మ హీరోయిన్‌గా అల్లరి నరేష్‌తో జోడీ కట్టనుంది. సోషల్ మీడియాలో మత్తెక్కించే అందాలతో కవ్వించే బోల్డ్ బ్యూటీ రుహాని శర్మ కొంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేయడం విశేషంగా మారింది.

సినిమా విడుదల తేదీ మరియు ప్లాట్‌ఫామ్

ఇక ఆల్కహాల్ సినిమాకు ప్రముఖ స్వరకర్త గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆల్కహాల్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాత.

ఇదిలా ఉంటే, నిర్మాత నాగవంశీ వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ‘ఆల్కహాల్’తో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఆల్కహాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

మొత్తంమీద, ‘ఆల్కహాల్’ సినిమా అల్లరి నరేష్ అభిమానులకు మరో వినోదాత్మక అనుభవాన్ని అందిస్తుందని ఆశిద్దాం. సినిమా విడుదల తేదీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.