📌 Key Points
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో AA22 చిత్రం తెరకెక్కుతోంది.
- ఈ సినిమాలో రష్మిక మందన్న విలన్ పాత్రలో నటించనుందనే వార్తలు వస్తున్నాయి.
- దీపికా పదుకొణెతో పాటు ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
- ముంబై షెడ్యూల్లో రష్మిక సోలో సీన్లలో పాల్గొంటోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న AA22 చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన్న విలన్ పాత్రలో నటించనుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
AA22లో రష్మిక విలన్ పాత్ర?
Allu Arjun 22:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika mandanna) శ్రీవల్లి పాత్రతో అదరగొట్టేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప 2’ సినిమా వచ్చి మరో సంచలనం సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాకి ‘పుష్ప : ది రాంపేజ్’ అంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈలోపు మరో డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు అల్లు అర్జున్.
కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘AA 22’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే 60% షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లోకి శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన్న అడుగుపెట్టింది ..అయితే ఇక్కడ ఎవరు ఊహించని ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు.. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే (Deepika Padukone) నటిస్తోంది. ఈమెతో పాటు మరో ఐదు మంది హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకరు రష్మిక మందన్న కూడా నటిస్తోంది అని తెలియడంతో ఇందులో కూడా శ్రీవల్లి మరో హీరోయిన్గా నటించనుంది అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఎవరు ఊహించని ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పుష్ప సినిమాలో జోడీగా, ఇందులో ప్రత్యర్థులుగా!
ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక.. తొలిసారి బన్నీను ఢీ కొట్టే విలన్ పాత్రలో నటించడం విశేషం. నిజానికి గత కొన్ని వారాలుగా ఇందులో రష్మిక విలన్ పాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు వచ్చినా టీం నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ముంబై షెడ్యూల్లో రష్మిక తన సోలో సీన్ల షూటింగ్లో పాల్గొంటుంది.. ఇది పూర్తయ్యాక అటు అల్లు అర్జున్, జాన్వి కపూర్ , జిమ్ సర్భ్ తో కలిసి కీలక సన్నివేశాలలో నటించనుందట మొత్తానికైతే పుష్ప సినిమాలో పుష్పరాజ్ కి జోడిగా అలరించిన ఈమె.. ఇప్పుడు విలన్ గా తలపడబోతోంది. ఇక అక్కడ రొమాన్స్ చేసిన ఈ జంట ఇక్కడ ప్రత్యర్ధులుగా ఎలా తలపడతారు అనేది చూడాలని అభిమానులలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ముంబైలో రష్మిక సోలో షూటింగ్
ఇక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా.. అల్లు అర్జున్ ఇందులో మల్టిపుల్ రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమాలో రష్మిక మందన్న విలన్ గానే నటిస్తుంది అని అధికారికం అయితే మాత్రం ఇప్పటివరకు హీరోతో రొమాన్స్ చేసి, ఆ తర్వాత ఢీ కొట్టిన హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందనడంలో సందేహం లేదు.
మొత్తానికి పుష్ప సినిమాలో జోడీగా నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న.. ఈ సినిమాలో ప్రత్యర్థులుగా ఎలా నటిస్తారో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రానుంది.


