
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తాజాగా ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఫిట్‌నెస్‌పై, తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
Key Points
అల్లు అర్జున్ యొక్క ఫిట్‌నెస్‌పై దృష్టి
ఆరు నెలల విశ్రాంతి అవసరం
వేవ్స్ సమ్మిట్లో ఆయన అనుభవాలను పంచుకున్నారు
భవిష్యత్ చిత్రాలపై దృష్టి
వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్
Allu Arjun : అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. త్వరలో అల్లు అర్జున్ – అట్లీ సినిమా మొదలు కానుంది. తాజాగా అల్లు అర్జున్ ముంబైలో నిర్వహించిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఆ స్టేజిపై అల్లు అర్జున్ ని ఇంటర్వ్యూ చేయగా పలు అంశాల గురించి మాట్లాడాడు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. యాక్టర్స్ కి ఫిట్నెస్ చాలా అవసరం. ఎప్పుడు డ్యాన్స్, ఫైట్ ఉంటుందో తెలీదు. ముందే మన బాడీని ప్రిపేర్ గా పెట్టుకోవాలి. నా 10వ సినిమా షూటింగ్ తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నా భుజం బాగా గాయపడింది. అంతకుముందు చిన్న సర్జరీ అయింది. మూడు వారాలు రెస్ట్ తీసుకొని నాలుగో వారం జిమ్ కి వెళ్ళిపోయాను. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాను. ఆస్ట్రేలియాలో జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. నేను అస్సలు ఊహించలేదు. కానీ రెండు మూడు నెలల్లో నా నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలి. అప్పుడు నేను చాలా భయపడ్డాను. అప్పుడు నాకు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలిసింది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ స్ట్రెంత్ తగ్గుతుంది. నా 11వ సినిమా నుంచి యాక్టింగ్ మీద, ఫిట్నెస్ మీద, ప్రతి సీన్ మీద మరింత ఫోకస్ చేసాను అని తెలిపాడు.
యాక్సిడెంట్ మరియు రికవరీ
ఫిట్‌నెస్ ప్రాముఖ్యత
అల్లు అర్జున్ యొక్క ఈ వెల్లడి అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెంచే విషయంలో ఇది ఒక మంచి ఉదాహరణ.
