
📌 Key Points
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన అల్లు అరవింద్.
- అల్లు శిరీష్ పెళ్లికి హాజరు కాలేకపోయిన చంద్రబాబు.
- చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు లేని అల్లు అర్జున్.
- సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు క్షమాపణలు తెలిపిన అల్లు అర్జున్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ అక్కడ లేకపోవడంతో ఆయన ఈ విధంగా స్పందించారు.
అల్లు అరవింద్ ఇంటికి చంద్రబాబు నాయుడు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగుకు అల్లు అర్జున్(Allu Arjun) చిన్న విరామం ప్రకటించారు. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Sirish) పెళ్లి వేడుకలు జరిగిన నేపథ్యంలో ఈ పెళ్లి కోసం అల్లు అర్జున్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు. పెళ్లి తర్వాత ఈయన తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఫ్రాన్స్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండదా తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu)కి క్షమాపణలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అసలు చంద్రబాబు నాయుడుకి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పడం ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అరవింద్ తన కొడుకు శిరీష్ పెళ్లి వేడుకలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి మర్యాదపూర్వకంగా పెళ్లికి ఆహ్వానించారు. అయితే చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో అల్లు అర్జున్ ఈ విషయం గురించి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మా ఇంటికి వచ్చి శిరీష్ నైనికలను ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
అల్లు అర్జున్ క్షమాపణలకు కారణం
Thank you Hon’ble CM of AP @ncbn garu for personally visiting our residence to bless Siri & Nayanika and extend your wishes to our family. Sorry, I was abroad at the time, but I was happy to speak with you over the phone. We are truly grateful for your warmth and blessings to… pic.twitter.com/fEHUsweJ9s
— Allu Arjun (@alluarjun) March 15, 2026
వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పోస్ట్
ఆ సమయంలో నేను విదేశాలలో ఉండటం వల్ల కలవలేకపోయాను అందుకు క్షమించండి. కానీ మీతో ఫోన్లో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. కొత్త జంట పట్ల మీరు చూపించిన ఆప్యాయత, మీరు అందించిన ఆశీర్వాదాలు మా మనసును తాకింది అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చంద్రబాబు నాయుడు తమ ఇంటికి రావడం కొత్త జంటను ఆశీర్వదించడం పట్ల అభినందనలు తెలుపుతూనే ఆ సమయంలో తను అందుబాటులో లేకపోవడంతో క్షమాపణలు కూడా తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా వెళ్లడంతో అల్లు అరవింద్ ఇంట్లో అందరూ కొంత సమయం పాటు సమావేశమై పలు విషయాల గురించి ప్రస్తావించారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఇంటికి రావడంతో అల్లు శిరీష్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది. వారి కుటుంబానికి చంద్రబాబు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.


