|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రేకింగ్: అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్ ఫిక్స్! గుండు లుక్‌తో ఊహించని షాక్ ఇచ్చిన ఐకాన్ స్టార్!!

Published: 08-04-2026, 2:35 AM
  • అల్లు అర్జున్ గుండు లుక్‌తో సంచలనం, వైకింగ్ టాటూలతో ఊహించని షాక్!
  • అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ మూవీ, భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న చిత్రం.
  • దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మాణంలో మూవీ!
  • హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్న బృందం, సినిమాపై భారీ అంచనాలు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. అంతేకాదు, బన్నీ గుండు లుక్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

గుండు లుక్‌లో అల్లు అర్జున్ సంచలనం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. టాలీవుడ్ సెన్సేషన్ బన్నీ, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రానికి ‘రాకా’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విషయానికొస్తే.. అల్లు అర్జున్ లుక్ చూసి సినీ లోకం షాక్ అవుతోంది. గుండుతో , కళ్లకు కాటుక పెట్టుకుని, సీరియస్‌గా కెమెరా వైపు చూస్తున్న లుక్ చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా ఆయన నుదిటిపై వైకింగ్ ట్యాటూలను పోలిన గుర్తులు ఉన్నాయి. అలాగే నిన్నటి టీజర్‌లో చూపించిన జంతువు గోళ్లు ఈ పోస్టర్‌లో కూడా హైలెట్‌గా నిలిచాయి. అట్లీ ఈ సారి ఏదో పెద్ద విజువల్ వండర్‌నే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ‘రాకా’ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక ఊహకందని పీరియాడికల్ యాక్షన్ డ్రామా అనే చర్చ మొదలైంది.

ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత వైవిధ్యమైన, భయంకరమైన లుక్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కాగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా మేకింగ్ కోసం నిర్మాత కళానిధి మారన్, అల్లు అర్జున్, అట్లీ ఇప్పటికే లాస్ ఏంజిల్స్ వెళ్లి ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ (VFX) టీమ్‌ను కలిశారు. ఆ టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. “మేము ఇప్పటివరకు చదివిన స్క్రిప్టుల్లో ఇది చాలా ప్రత్యేకం” అని చెప్పడం సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. ఇక రణ్‌వీర్ సింగ్ కూడా ఈ మూవీ సెట్స్‌కు వెళ్లి, “భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక అద్భుతాన్ని అట్లీ సృష్టిస్తున్నాడు” అని ప్రశంసించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.

‘రాకా’ మూవీతో అట్లీ మరో బ్లాక్ బస్టర్?

హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.