|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. స్పెషల్ వీడియో రిలీజ్.. విజయం వైపు మహారాణి అంటూ!

Published: 07-06-2025, 3:01 AM
అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. స్పెషల్ వీడియో రిలీజ్.. విజయం వైపు మహారాణి అంటూ!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఏఏ22ఏ6 సినిమాకు దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. సన్ పిక్చర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

2

సన్ పిక్చర్స్ దీపికా పదుకొణె స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

4

ప్రభాస్ మూవీని వదులుకున్న దీపికా ఈ సినిమాలో నటించడానికి గల కారణాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

దీపికా పదుకొణె అధికారిక ప్రకటన

పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ మూవీ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఏఏ22ఏ6 మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇందుకోసం హాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన చేసిన అల్లు అర్జున్ మేకింగ్ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా రివీల్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి సంబంధించిన ‘ది ఫేస్ ఆఫ్ AA22xA6’ పేరుతో దీపికా పదుకొణె స్పెషల్ వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

స్పెషల్ వీడియోలో హైలైట్స్

“విజయం దిశగా వెళ్తున్న మహారాణి. దీపికా పదుకొణెకు స్వాగతం” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దీపికా పదుకొణె మొహం చూపించకుండా డైరెక్టర్ అట్లీ స్టోరీ, నెరేషన్ వినిపిస్తున్నట్లుగా చూపించారు. తర్వాత కాసేపటికి దీపికా పదుకొణె ఫేస్ రివీల్ చేస్తూ చూపించే షాట్ బాగుంది.

తర్వాత అట్లీ చెప్పిన స్టోరీకి ఫిదా అయినట్లుగా దీపికా పదుకొణె ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. దాంతో సినిమాను ఒప్పుకుని దీపికా చేస్తున్నట్లు చూపించారు. కట్ చేస్తే.. కత్తి పట్టి గుర్రంపై దీపికా పదుకొణె స్వారీ చేసే సీన్‌ను వీఎఫెక్స్‌లో తెరకెక్కించారు. కేవలం మేకింగ్‌ను మాత్రమే చూపించారు. అవుట్‌పుట్ ఏది రివీల్ చేయలేదు.

ఇక మధ్యలో కొన్ని పెయింటింగ్స్, యోధురాలిగా, సూపర్ ఉమెన్‌గా దీపికా పదుకొణె కత్తి పట్టి యాక్షన్ చేసే కొన్ని సీన్స్, పిక్స్, చూపించారు. ఇలా ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్‌గా దీపికా పదుకొణె వీడియో సాగింది. ఇదిలా ఉంటే, ఇటీవలే ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ మూవీ తర్వాత దీపికా నిర్ణయం

దీపికా పదుకొణె పెట్టిన కండిషన్స్ కారణంగానే ఆమెను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తప్పించినట్లు టాక్ నడిచింది కూడా. మరి స్పిరిట్ మూవీని వద్దనుకును అల్లు అర్జున్ చిత్రాన్ని దీపికా చేయడానికి గల కారణాలేంటో అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

ఇకపోతే ఇదివరకు డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన షారుక్ ఖాన్ జవాన్ మూవీలో ఓ హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించింది. ఇప్పుడు రెండోసారి డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొణె పనిచేస్తుంది.

దీపికా పదుకొణె నటనతో ఈ సినిమాకు మరింత ఆసక్తి పెరిగింది. ఈ కాంబినేషన్ సినిమాకు ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.