|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్‌పై కుట్ర: క్షమాపణ చెప్పిన కావేరి, స్వీకృతి! అసలేం జరిగిందంటే?

Published: 17-02-2026, 3:05 AM
అల్లు అర్జున్‌పై కుట్ర: క్షమాపణ చెప్పిన కావేరి, స్వీకృతి! అసలేం జరిగిందంటే?
  • అల్లు అర్జున్‌పై వచ్చిన ఆరోపణలను కావేరి బారువా, స్వీకృతి ఉపసంహరించుకున్నారు.
  • షూటింగ్ సెట్స్‌లో 42 నిబంధనలు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ.
  • తప్పుడు సమాచారం వల్ల అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని క్షమాపణలు.
  • సెలబ్రిటీల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని హితవు.

పుష్ప నటుడు అల్లు అర్జున్‌పై వచ్చిన ఆరోపణలకు తెరపడింది. ఆయన సెట్స్‌లో 42 నిబంధనలు విధిస్తారంటూ వచ్చిన వార్తలను కావేరి బారువా, స్వీకృతి ఖండించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

క్షమాపణలు చెప్పిన కావేరి, స్వీకృతి

Allu Arjun Controversy: ప్రముఖ సినీ నటుడు, ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూలలో వచ్చిన వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. అల్లు అర్జున్ షూటింగ్ సెట్స్‌లో అనుసరిస్తారని చెప్పబడిన వివాదాస్పద నిబంధనల గురించి మాట్లాడిన కావేరి బారువా, స్వీకృతి తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్ తన సిబ్బంది, సెట్స్‌లో ఉండేవారి కోసం “42 నిబంధనలతో (42 do’s and don’ts)” కూడిన ఒక పత్రాన్ని జారీ చేస్తారని, అది చాలా కఠినంగా ఉంటుందని కావేరి, స్వీకృతి వ్యాఖ్యానించారు. ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. దీనివల్ల అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా, ఆయన అభిమానులు కూడా తీవ్ర అసహనానికి లోనయ్యారు.

Read also- Hotstar Couples Show: స్టార్ మాలో కొత్త షో.. రిసార్ట్ లో జంటలు.. జనాలకు పిచ్చెక్కడం ఖాయం..!

పరిస్థితి తీవ్రతను గమనించిన సదరు వ్యక్తులు, తాము చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ఇప్పుడు స్పష్టం చేశారు. వారు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఇలా చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ తరపున గానీ, ఆయన టీమ్ తరపున గానీ ఎప్పుడూ ఎటువంటి “42 నిబంధనల” డాక్యుమెంట్ జారీ చేయబడలేదని వారు అంగీకరించారు. అటువంటి పత్రం అసలు ఉనికిలోనే లేదని వారు ఖచ్చితంగా చెప్పారు. తాము చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేదా వాస్తవ రికార్డుల ఆధారంగా చేసినవి కావని, కేవలం మాటల ప్రవాహంలో  వచ్చినవని వారు ఒప్పుకున్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు, తద్వారా నటుడి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు వారు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ “అన్ కండిషనల్ అపాలజీ” చెప్పారు.

42 నిబంధనల వివాదంపై స్పష్టత

Read also- Celebrities : కూతురు పుట్టాక 1000 కోట్ల సినిమాల్లో నటించిన స్టార్ హీరోలు ఎవరంటే..?

సెలబ్రిటీల గురించి మాట్లాడేటప్పుడు కనీస బాధ్యత వహించాలని, ప్రాథమిక సమాచారాన్ని కూడా సరిచూసుకోకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అల్లు అర్జున్ టీమ్ ఈ వ్యవహారాన్ని హుందాగా ఎదుర్కొన్న తీరును అభిమానులు ప్రశంసిస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు ఎన్ని వచ్చినా, వాస్తవాలు ఎప్పుడూ వెలుగులోకి వస్తాయని ఈ పరిణామంతో స్పష్టమైంది. అయితే ఇదే సందర్భంలో అల్లు అర్జున్ పీఆర్ టీం తనను హింసిస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని స్వీకృతి తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఇంతో ఈ వివాదం మరింత వెడెక్కింది. దీనిని చూసిన నెటిజన్లు ఇదంతా పబ్లిక్ అటెన్సన్ కోసమే చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఇలాంటివిరి వల్ల సెలబ్రెటీలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు.

అల్లు అర్జున్ టీమ్ హుందాతనం

అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూలలో వచ్చిన వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. అల్లు అర్జున్ షూటింగ్ సెట్స్‌లో అనుసరిస్తారని చెప్పబడిన వివాదాస్పద నిబంధనల గురించి మాట్లాడిన కావేరి బారువా, స్వీకృతి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. pic.twitter.com/RqHYkbGwYf

— మంచాల బాబు (@manchalababu03) February 17, 2026

అల్లు అర్జున్ పట్ల బాధ్యత లేకుండా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. సెలబ్రిటీల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.