|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: భార్యకు 5 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్! వైరల్ వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 07-03-2026, 7:35 PM
షాకింగ్: భార్యకు 5 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్! వైరల్ వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డికి రూ. 5 కోట్ల ఖరీదైన బెంజ్ ఏ.ఎం.జి కారును పెళ్లిరోజు కానుకగా ఇచ్చాడు!
  • మార్చి 6న అల్లు అర్జున్, స్నేహారెడ్డిల 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ లగ్జరీ గిఫ్ట్ అందించారు.
  • అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో బన్నీ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సతీమణి స్నేహారెడ్డికి ఆయన ఇచ్చిన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం!

భార్యకు బన్నీ ఇచ్చిన భారీ గిఫ్ట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. తాజాగా తన సోదరుడు అల్లు శిరీష్ – నైనిక రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తన తమ్ముడు శిరీష్ పెళ్లి కానుకగా అల్లు అర్జున్ ఒక ఖరీదైన లగ్జరీ కార్ ని తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఉన్న ఘాడమైన అనుబంధానికి ఈ కానుక ఓ నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. కానీ ఈ కార్ ని అల్లు శిరీష్ పెళ్లి కానుకగా అల్లు అర్జున్ అందించలేదని..? అల్లు అర్జున్.. తన భార్య స్నేహ రెడ్డి పెళ్లి రోజు బహుమతిగా తన భార్య స్నేహ రెడ్డికి బహుమతిగా అందించాడని తాజా సమాచారం.

15 ఏళ్ల బంధం.. బెంజ్ కారు కానుక!

ఇందుకు సంబంధించి శుక్రవారం రోజు వారి పెళ్లి రోజు సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి ఈ కారుని బహుమతిగా అందించినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా బర్త్ డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వడం బన్నీకి అలవాటు. ఈ ఏడాది మ్యారేజ్ డే ఆయనకు మరి కాస్త స్పెషల్. దీంతో ఖరీదైన బహుమతిని తన భార్యామనికి అందించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ – స్నేహరెడ్డి వివాహ బంధానికి మార్చ్ 6 తో 15 సంవత్సరాలు. అల్లు అర్జున్ 2011లో స్నేహరెడ్డిని మార్చ్ 6 న వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్య స్నేహరెడ్డికి విషెస్ చెబుతూ పోస్ట్ చేశాడు.

అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్!

అలాగే ఇదే రోజున తన సోదరుడు శిరీష్ కూడా నైనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి రోజున అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏ.ఎం.జి మోడల్ కారుని బహుమతిగా అందించాడు. ప్రస్తుతం ఈ మోడల్ కారు ధర మార్కెట్లో 4 నుండి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ తోను ఓ మూవీ కమిట్ అయ్యాడు బన్నీ. ఈ మూవీ కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ తన భార్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.