
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో నాలుగు పాత్రల్లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 800 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
Key Points
అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో నాలుగు పాత్రల్లో నటిస్తున్నారు.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 800 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.
తాత, తండ్రి, మరియు ఆయన ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ నటించనున్నారు.
ఈ సినిమా విడుదల తర్వాత ఇండస్ట్రీ షేక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ నాలుగు పాత్రలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)… పుష్ప సినిమాతో (Pushpa 2) తన క్రేజ్ ను పెంచుకున్నాడు. పుష్ప, పుష్ప 2 రెండు సినిమాలు బంపర్ హిట్ కావడంతో… ప్రపంచ స్థాయి హీరోగా మారిపోయారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత… అట్లీ కుమార్ (Atlee Kumar ) తో మరో కొత్త మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 800 కోట్లతో… ఈ సినిమా తెరకెక్కుతోంది.
అట్లీ కొత్త సినిమా
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.. ఈ మూవీలో అల్లు అర్జున్ మొత్తం నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఒకే సినిమాలో డబుల్ రోల్ చూసాం కానీ.. అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా నాలుగు పాత్రలలో కల్పించనున్నారట.
800 కోట్ల బడ్జెట్
ఇందులో తాత, తండ్రి అలాగే ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు… ఇలా మొత్తం నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ మెరవబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ అప్డేట్ గురించి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ న్యూస్ వినగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేస్తున్నారు. ఒక్క పాత్రకే అల్లు అర్జున్ చింపేస్తే… ఇప్పుడు నాలుగు పాత్రలతో వస్తే… ఇండస్ట్రీ షేక్ అవడం పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నారని మొన్నటి వరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ నాలుగు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


