|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AA 23 ప్రకటన ఫిక్స్? అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో సూపర్ పవర్స్ హీరో!

Published: 07-01-2026, 10:35 AM
AA 23 ప్రకటన ఫిక్స్? అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో సూపర్ పవర్స్ హీరో!
  • అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమాపై గత కొద్దిరోజులుగా వార్తలు.
  • మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం.
  • జనవరి 23న సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తాజా సమాచారం.
  • బన్నీ ఈ చిత్రంలో కుడి చేతిని కోల్పోయి సూపర్ పవర్స్ ఉన్న విభిన్న పాత్రలో కనిపించనున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో AA 23 సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రంపై జనవరి 23న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ విభిన్నమైన, సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇది అభిమానులకు అసలైన పండుగే.

అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ సినిమాపై తాజా అప్‌డేట్

Allu Arjun Lokesh Kanagaraj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. ఇక గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిందని ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

అధికారిక ప్రకటన తేది ఖరారైందా? జనవరి 23న పండుగ!

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల లోకేష్  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సంగతి తెలిసిందే .అయితే  ఈ సినిమా కోసమే ఈయన హైదరాబాద్ వచ్చారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా  గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని, ఈ సినిమాకు సంబంధించి జనవరి 23 తేదీ ప్రకటన రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిగా బన్నీ..

బన్నీ విభిన్న పాత్రలో.. సూపర్ పవర్స్ తో రచ్చ!

సంక్రాంతి పండుగ అనంతరం ఈ సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతుందని తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ లోకేష్ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలో షూటింగ్ పనులు పూర్తి కాబోతున్నాయని తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలోనే లోకేష్ తో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని కుడి చేతిని కోల్పోయి సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తి పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ సినిమాపై వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నా, AA 23పై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.