|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: భారీ హైప్ క్రియేట్ చేస్తున్న పిక్.. ఫొటోలో బన్నీతో ఉన్నది ఎవరో తెలుసా.. ఇది నెక్స్ట్ లెవల్ సెటప్

Published: 30-09-2025, 1:45 AM
Allu Arjun: భారీ హైప్ క్రియేట్ చేస్తున్న పిక్.. ఫొటోలో బన్నీతో ఉన్నది ఎవరో తెలుసా.. ఇది నెక్స్ట్ లెవల్ సెటప్

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నారు. తాజాగా జపాన్-బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషి బన్నీతో దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఇది సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Key Points

1

అల్లు అర్జున్-అట్లీ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది.

2

సన్ పిక్చర్స్ ఈ సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.

4

అల్లు అర్జున్‌తో కొనిషి ఫోటో వైరల్ అయి భారీ హైప్‌ను సృష్టిస్తోంది.

అల్లు అర్జున్ సినిమాకు భారీ బడ్జెట్

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న (Allu Arjun)విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. భారీ విజువల్స్, హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Bahubali The Epic: కొత్తగా వస్తున్న పాత సినిమా.. కొత్త సీన్లు సెట్, పాత సీన్లు కట్.. రాజమౌళి ‘ఎపిక్’ ప్లాన్

అట్లీ మూవీలోకి హాలీవుడ్ టెక్నీషియన్

ఇక టెక్నీషయన్స్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కోసం అవతార్, ఎవెంజర్స్, స్టార్ వార్ లాంటి సినిమాలకు వర్క్ చేసిన వారిని హైర్ చేసుకోగా ఇప్పుడు ఈ లిస్టులోకి మరో స్టార్ టెక్నీషియన్ చేరాడు. ఆ టెక్నీషియన్ మరెవరో కాదు “హొకుటో కొనిషి”. ఈయన ప్రముఖ జపనీస్-బ్రిటిష్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అల్లు అర్జున్ సినిమా కోసం హొకుటో కొనిషిని తీసుకున్నారట. ఇప్పటికే ఈ డాన్సర్ ముంబై లో అడుగుపెట్టేశాడట. సినిమాకు సంబంధించి పనులు కూడా మొదలుపెట్టేశాడట. ఆ సమయంలో అల్లు అర్జున్ తో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న బన్నీ, హొకుటో ఫోటో

ఆ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్స్ అవాక్కవుతుండగా.. చాలా మంది మాత్రం అతను ఎవరో తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఆయన గురించి తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పాపులర్ అయిన అల్లు అర్జున్.. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి ఎదగడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. 2027లో ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

అల్లు అర్జున్-అట్లీ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. హాలీవుడ్ స్థాయి నిర్మాణంతో, గ్లోబల్ టెక్నీషియన్ల భాగస్వామ్యంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.