
📌 Key Points
- అల్లు అర్జున్ ప్రశాంత్ కిశోర్ తో భేటీ.. రాజకీయ వ్యూహ రచనపై చర్చలు
- TVK విజయ్ సక్సెస్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న బన్నీ?
- రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ గ్రౌండ్ వర్క్ మొదలు
- త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు! ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తమిళ స్టార్ విజయ్ బాటలో బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా?
ప్రశాంత్ కిశోర్ తో బన్నీ సీక్రెట్ మీటింగ్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అంటే ఫిలిం నగర్, రాజకీయ వర్గాల్లో అవుననే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ (Political Entry) ఇచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఈ మేరకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తోనూ సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది.
మన దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజకీయాలకు సినిమాలకు మధ్య ఒకదానికొకటి విడదీయరాని సంబంధం ఉంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఇటీవలే తమిళనాడులో తలపతి విజయ్ పార్టీని పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమా కెరీర్‍ను వదిలేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ అతి తక్కువ సమయంలోనే బంపర్ విక్టరీ సాధించడంతో మరికొంత మంది నటులు అదే బాటలో రాజకీయ రంగంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వెండితెరపై తనదైన నటన, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేసేందుకు బలమైన పునాది వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందరి మాదరిలా కాకుండా ఇప్పటి వరకు సినిమా టు పొలిటికల్ ట్రాక్ లోకి వచ్చిన వారి విజయాలు, వైఫల్యాలను అంచనా వేసుకుంటూ అత్యంత వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ లాగా అల్లు అర్జున్ కూడా రాజకీయ బాట?
ఇందులో భాగంగా ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌తో అల్లు అర్జున్ అంతర్గత సంప్రదింపులు జరిపారనే వార్తలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారాయి. టీవీకే చీఫ్ విజయ్ గెలుపులో ప్రశాంత్ కిశోర్ టీమ్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో విజయ్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నామని మరీ విజయం దక్కేలా చేశారు. తలపతి సక్సెస్ కోసం వ్యూహరచన చేసిన పీకే స్ట్రాటజీతోనే అల్లుఅర్జున్ రాజకీయ బాటలు సిద్ధం చేసుకుంటున్నారని ఇందుకోసం విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువై, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు ఇప్పుడు బన్నీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అభిమానుల్లో హడలెత్తించిన పొలిటికల్ ఎంట్రీ టాక్
అల్లుఅర్జున్ పొలిటికల్ ఎంట్రీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం నిజంగానే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఏపీ పాలిటిక్స్ పై దృష్టి పెడతారా లేక తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెడతారా అనేది ఆసక్తిగా మారింది. ఏపీలో ఇప్పటికే బన్నీ మామ పవన్ కల్యాణ్ జనసేన రూపంలో బలమైన శక్తిగా ఎదిగింది. ఒకవేళ అక్కడ రాజకీయాలు చేయాలని భావిస్తే టీడీపీ, వైసీపీతో పాటు పవన్ కల్యాణ్ పార్టీతోను ఢీ కొట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా తెలంగాణపై దృష్టి సారిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ పరిణామంతో అల్లు అర్జున్ తప్పకుండా రాజకీయ రంగప్రవేశం చేస్తారనే చర్చ గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బన్నీ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ తెరపైకి రావడంతో తెలుగు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.
అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ వార్తలు అభిమానుల్లో భారీ ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!


