|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ అవార్డు పై స్పందించిన అల్లు అర్జున్, పుష్ప 2 కోసం అవార్డును అభిమానులకు అంకితం

Published: 29-05-2025, 11:16 AM
గద్దర్ అవార్డు పై స్పందించిన అల్లు అర్జున్, పుష్ప 2 కోసం అవార్డును అభిమానులకు అంకితం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డును అందుకుంటున్నారు. ఈ అవార్డును అందుకున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Key Points

1

అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు గద్దర్ అవార్డు అందుకుంటున్నారు.

2

తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.

4

పుష్ప సినిమా యూనిట్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పుష్ప 2కు గద్దర్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. అందులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను అందుకోబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా, “పుష్ప 2: ది రూల్” చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తనకు గద్దర్ అవార్డును ప్రకటించడంపై అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికపై స్పందించారు.

ఈ గౌరవం అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని అల్లు అర్జున్ అన్నారు. ” పుష్ప సినిమాకుగాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను, ఈ అవార్డును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అల్లు అర్జున్ స్పందన

ఇది తాను ఒక్కడిగా సాధించలేనని, ఈ అవార్డుకు పాత్రులైన వారు ఎంతోమంది ఉన్నారని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ నా నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది అని ఆయన వెల్లడించారు. సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

అంతే కాదు ఈ అవార్డు తన అభిమానులకే అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. . ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ మద్దతు నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది అని అన్నారు.

అభిమానులకు అంకితం

రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్” చిత్రంలోని ఆయన పాత్రకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఇప్పటికే పుష్ప సినిమాకు జాతీయ అవార్డ్ సాధించిన బన్నీ.. గద్దర్ అవార్డ్ కూడా రావడంతో మరో మెట్టు ఎక్కినట్టు అయ్యింది. ఈ ఉత్సాహంతో పుష్ప3ని అంతకు మించి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు టీమ్.

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విజయానికి తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గద్దర్ అవార్డు వారి ప్రోత్సాహం ఫలితమని, భవిష్యత్తులో మరింత మంచి సినిమాలతో వారిని అలరించాలని ఆయన అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.