|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: అల్లు అర్జున్‌ను ఆపేసిన సెక్యూరిటీ సిబ్బంది.. బన్నీ ఏం చేశాడంటే?

Published: 10-08-2025, 4:54 AM
Allu Arjun: అల్లు అర్జున్‌ను ఆపేసిన సెక్యూరిటీ సిబ్బంది.. బన్నీ ఏం చేశాడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ సిబ్బందిచే ఆపబడ్డారు. మాస్క్ మరియు అద్దాలు ధరించి ఉన్నందున ఫేస్ చూపించమని సిబ్బంది కోరారు. బన్నీ ఏం చేశారో తెలుసుకుందాం.

Key Points

1

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌ను సెక్యూరిటీ ఆపింది.

2

మాస్క్, అద్దాలు తీసి ఫేస్ చూపించమని సెక్యూరిటీ అడిగింది.

4

ఈ ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ముంబై ఎయిర్‌పోర్ట్ ఘటన

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‌ గురించి పాన్ ఇండియా మాత్రమే కాదు .. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తు పడతారు . పుష్ప తర్వాత బన్నీ రేంజ్ ‌ అమాంతం పెరిగిపోయింది . మనదేశంతో పాటు వరల్డ్ ‌ వైడ్ ‌ గా ఫ్యాన్స్ ఉన్నారు . పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ‌ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‌ అట్లీతో జతకట్టారు . వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది

సెక్యూరిటీ నిబంధనలు

ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో బిజీ అయిపోయారు ఐకాన్ స్టార్ . ఇటీవలే ముంబయి ట్రిప్ ‌ కు వెళ్లారు . తన కుటుంబంతో కలిసి వెళ్లిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి .

వైరల్ వీడియో

అయితే ముంబయి ఎయిర్ ‌ పోర్ట్ ‌ లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది . విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు . ముఖానికి మాస్క్ , అద్దాలు తీసి ఫేస్ చూపించాలని అడిగారు . పక్కనే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ ‌ ‍ అని చెప్పినా కూడా వినలేదు . భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల ప్రకారం మొహం చూపించాల్సిందేనని ఎయిర్ ‌ పోర్ట్ ‌ సిబ్బంది అడిగారు . దీంతో బన్నీ వెంటనే మాస్క్ ‌, కళ్లద్దాలు తొలగించి ఫేస్ చూపించి లోపలికి వెళ్లిపోయారు . ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది . స్టార్ హీరోలను చూస్తే సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారని గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్లడం సాధారణమే .. అయినప్పటికీ విమానాశ్రయాల్లో రూల్స్ ‌ ఎవరికైనా ఒక్కటే కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

అల్లు అర్జున్‌ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం ప్రశంసనీయం. ఈ ఘటన సెలబ్రిటీలకు కూడా విమానాశ్రయ నిబంధనలు వర్తిస్తాయని చూపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.