|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కలిసి సినిమా! రికార్డులు బద్దలే!!

Published: 07-03-2026, 12:05 AM
  • ఐకాన్ స్టార్, రౌడీ బాయ్ కలిసి ఒకే స్క్రీన్‌పై! టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్.
  • లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 చిత్రం.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా అంచనాలు.
  • పాన్ ఇండియా స్టార్స్‌తో లోకేష్ మల్టీస్టారర్ ప్లాన్.. రజినీకాంత్ కూలీ మూవీ తరహాలో భారీ చిత్రం.
  • అల్లు అర్జున్ యాక్షన్, విజయ్ దేవరకొండ స్టైల్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధం!

టాలీవుడ్ సినీ అభిమానులకు ఇది నిజంగా పండగే! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23

Allu Arjun-Vijay Devarakonda : ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో మూవీ అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే బన్నీ తన 23వ చిత్రం AA23లో డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అల్లుఅర్జున్, లోకేశ్‌ కనగరాజు కాంబోలో వస్తున్న పిక్చర్‌లో మరో యంగ్ సెన్సేషన్‌ విజయ్ దేవరకొండ కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందట. విజయ్‌, బన్నీతో భారీ మల్టీ స్టారర్‌గా మలిచే ప్లాన్ చేస్తున్నాడట లోకేశ్ కనగరాజ్‌. అల్లు అర్జున్‌ యాక్షన్ హీరో ఇమేజ్‌తో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఎనర్జీ కలిస్తే బొమ్మ దద్దరిలిపోవాల్సిందే అంటున్నారు.

మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్న లోకేష్

లోకేశ్‌ కనగరాజ్ తన కూలీ మూవీలో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ వంటి పాన్ ఇండియా స్టార్లను ఒకేసారి కలిపి మల్టీ స్టారర్‌ను సృష్టించి సంచలనం సృష్టించాడు. అదే లైన్‌లో ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో మరో మల్టీస్టారర్ పిక్చర్‌ను తెరకెక్కించి ఆడియన్స్‌కు మించి కిక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్.

పాన్ ఇండియా మూవీగా రాబోతున్న చిత్రం

రౌడీ బాయ్, ఐకాన్ స్టార్ కాంబినేషన్‌లో యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో కూడిన బ్లాక్‌బస్టర్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ వరకు అభిమానులు ఈ కాంబినేషన్‌లో రాబోయే మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.