|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun : భార్య పుట్టిన రోజు.. నెదర్లాండ్స్ నుంచి స్పెషల్ పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్..

Published: 29-09-2025, 11:46 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బన్నీ నెదర్లాండ్స్ నుంచి స్పెషల్ పోస్ట్ చేస్తూ, స్నేహతో దిగిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు స్నేహకు శుభాకాంక్షలు తెలిపారు.

Key Points

1

నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టినరోజు.

2

పుట్టినరోజు వేడుకల కోసం బన్నీ కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్ వెకేషన్‌కు వెళ్లారు.

3

భార్య స్నేహా రెడ్డితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే క్యూటీ' అని రాసుకొచ్చారు.

4

స్నేహ రెడ్డి కూడా ఆమ్‌స్టర్‌డామ్‌లో బన్నీతో దిగిన పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పంచుకున్నారు.

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్

Allu Arjun : నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు. ఈ క్రమంలో పలువురు ఫ్యాన్స్, సెలబ్రిటీలు స్నేహకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భార్య పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసేందుకు బన్నీ తన భార్య, పిల్లలతో నెదర్లాండ్స్ వెకేషన్ కి వెళ్ళాడు.(Allu Arjun)

నెదర్లాండ్స్ నుంచి బన్నీ స్పెషల్ పోస్ట్

నెదర్లాండ్స్ లో భార్య స్నేహ రెడ్డితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే క్యూటీ అని రాసుకొచ్చాడు అల్లు అర్జున్. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అలాగే స్నేహ కూడా నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డాం వీధుల్లో బన్నీతో కలిసి దిగిన పలు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేసింది.

స్నేహ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు

నెదర్లాండ్స్‌లో భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజును అల్లు అర్జున్ ప్రత్యేకంగా జరుపుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోలు వారి దాంపత్య బంధాన్ని, సెలబ్రేషన్స్ ఆనందాన్ని తెలియజేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.