
📌 Key Points
- అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా జూన్ మధ్య నుండి కీలక షెడ్యూల్ ప్రారంభం.
- దీపికా పదుకోన్, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
- ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్, విజువల్ సీక్వెన్స్‌లు చిత్రీకరణ.
- CGI షాట్స్‌ను ముందే పూర్తి చేస్తూ పక్కా ప్లానింగ్‌తో మేకర్స్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘రాకా’ గురించి ఓ సంచలన అప్‌డేట్ విడుదలైంది. జూన్ మధ్య వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన, సుదీర్ఘ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో భారీ తారాగణం పాల్గొనబోతోంది.
‘రాకా’ షూటింగ్ కీలక అప్‌డేట్
Raka Movie Update: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ప్రస్తుతం గ్లోబల్ లెవెల్‌కు చేరుకుంది. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్‌లో ‘రాకా’ సినిమా ఒకటి. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ అప్‌డేట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా సరికొత్త, అత్యంత కీలకమైన లాంగ్ షెడ్యూల్ జూన్ మధ్య వారం నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డులు మొత్తం బంద్దలు గొట్టాడు. రామోయే అట్లీ చిత్రంతో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.
Read also- చిక్కుల్లో నిర్మాత.. ‘కాలా హీరన్’ మూవీ టీమ్‌కు సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసులు..
ఈ భారీ షెడ్యూల్‌లో సినిమాలోని లీడ్ కాస్ట్ అంతా జాయిన్ కాబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్, వర్సటైల్ యాక్టర్ జిమ్ సర్భ్, మరియు ఫెమినా జార్జ్ ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు. వీరితో పాటు మరికొంతమంది ప్రధాన తారాగణం, కీ టెక్నీషియన్స్ కూడా ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు.
భారీ తారాగణం, యాక్షన్ సీక్వెన్స్‌లు
చిత్ర యూనిట్ నమ్మకం ప్రకారం.. జూన్ మధ్యలో మొదలయ్యే ఈ సుదీర్ఘ షెడ్యూల్ ముగిసే సమయానికి, సినిమాలోని అత్యంత క్లిష్టమైన భారీ యాక్షన్, విజువల్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయే భాగంలో కేవలం టాకీ సీన్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయని, వాటిని చాలా వేగంగా పూర్తి చేయవచ్చని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read also- ‘పెద్ది’ రిలీజ్ దగ్గరపడుతున్నా ఇంకా ఓపెన్ కాని బుకింగ్స్!.. కారణం ఇదేనా?
ముందస్తు ప్రణాళికతో మేకర్స్
షూటింగ్ ప్రాసెస్ ఎలాంటి అడ్డంకులు లేకుండా, చాలా స్మూత్‌గా సాగడం కోసం మేకర్స్ మొదటి నుంచీ ఒక పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. సినిమాలో హై-ఎండ్ గ్రాఫిక్స్ (CGI) అవసరమైన భారీ భాగాలను చిత్ర యూనిట్ ముందే ప్రయారిటీగా తీసుకుంది. గత ఏడాది కాలంగా ఈ సీజీఐ షాట్స్‌ను ఒక్కొక్కటిగా షూట్ చేస్తూ వస్తున్నారు. ఈ ముందస్తు ప్లానింగ్ వల్ల అవుట్‌పుట్ అద్భుతంగా రావడమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సులువవుతుందని ఇన్ సైడ్ టాక్.
భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీపై ట్రేడ్ వర్గాల్లో ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి. జూన్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
‘రాకా’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ షెడ్యూల్‌తో షూటింగ్ వేగం పుంజుకోవడం ఖాయం. అల్లు అర్జున్, దీపికా పదుకోన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


