|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Sirish Engagement : గ్రాండ్‌గా అల్లు శిరీష్- నయనిక ఎంగేజ్‌మెంట్‌

Published: 31-10-2025, 12:34 PM
Allu Sirish Engagement : గ్రాండ్‌గా అల్లు శిరీష్- నయనిక ఎంగేజ్‌మెంట్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా నయనికతో ఆయన నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. శిరీష్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకోగా, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.

2

హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకున్నారు.

4

నిశ్చితార్థ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గ్రాండ్‌గా జరిగిన నిశ్చితార్థ వేడుక

ఐకాన్ స్టార్ ‌ అల్లు అర్జున్ తమ్ముడు త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు . తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్ ‌ మెంట్ ‌ గ్రాండ్ ‌ గా జరిగింది . హైదరాబాద్ ‌ లో జరిగిన ఈ వేడుకలో శిరీష్ – నయనిక ఉంగరాలు మార్చుకున్నారు . ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్‌మెంట్‌ విత్ లవ్‌ ఆఫ్ మై లైఫ్ నయనిక అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు.

వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ‌ గా మారాయి . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇటీవలే వర్షం కారణంగా ఎంగేజ్ ‌ మెంట్ ‌ కు అటంకం కలిగిందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు . దీంతో ఇవాళ వాతావరణం అనుకూలించడంతో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు .

అల్లు శిరీష్ సినీ కెరీర్

కాగా .. అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్‌ తమ్ముడిగా శిరీష్.. ‘గౌరవం’ (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు.

అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వార్తతో అల్లు అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతుండగా, కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.