
📌 Key Points
- అల్లు శిరీష్, నైనిక రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది.
- దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీని ఘనంగా నిర్వహించారు.
- అల్లు ఇంట్లో పెళ్లి వేడుకలు పసుపు దంచే కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.
- అల్లు శిరీష్ తన చిరకాల ప్రేమికురాలు నైనికను వివాహం చేసుకోనున్నారు.
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ వివాహం త్వరలో జరగనుంది. అల్లు వారి ఇంట్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పసుపు దంచే కార్యక్రమంతో ఈ వేడుక మొదలైంది. మార్చి 6న శిరీష్, నైనిక రెడ్డి వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు.
అల్లు ఇంట పెళ్లి సందడి ప్రారంభం
Allu sirish: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెళ్లి భాజలు మోగబోతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న వారందరూ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు ఇంట కూడా పెళ్లి భాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే.. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అయిన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం అల్లు శిరీష్(Allu Sirish) నైనిక(Nainika) తమ స్నేహితులకు ఎంతో ఘనంగా బ్యాచిలర్ పార్టీని ఇచ్చారు. దుబాయ్ లో ఈ బ్యాచిలర్ పార్టీ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ తన సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పనులకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేశారు. తన ఇంట్లో తన పెళ్లి పనులు నేటి నుంచి ప్రారంభం అయ్యాయని ఈయన తెలియచేశారు. ఈయన షేర్ చేసిన ఫోటో చూస్తుంటే మాత్రం పసుపు దంచే కార్యక్రమం మొదలైనట్టు తెలుస్తోంది . మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎలాంటి వేడుక మొదలైన ముందు పసుపుతోనే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు కూడా పసుపు దంచే కార్యక్రమం తోనే మొదలయ్యాయని శిరీష్ షేర్ చేసిన ఫోటో ద్వారా స్పష్టం అవుతుంది. ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి, పూజలు చేసిన అనంతరం ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు స్పష్టమవుతుంది.
దుబాయ్ లో ఘనంగా బ్యాచిలర్ పార్టీ
ఇక అల్లు శిరీష్ నైనిక వివాహం మార్చి ఆరో తేదీ జరగబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని సమాచారం ఈ పెళ్లి వేడుకలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక అల్లు శిరీష్ తను ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నారు. శిరీష్ గత రెండు సంవత్సరాలుగా నైనిక రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇలా రెండేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ వీరి ప్రేమ విషయాన్ని బయట ఎక్కడ తెలియజేయలేదు.
అక్టోబర్ 31న నిశ్చితార్థం..
మార్చి 6న అల్లు శిరీష్ వివాహం
ఇక నిశ్చితార్థానికి ముందు అల్లు శిరీష్ అధికారకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక వీరి నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 31వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక వివాహం మాత్రం ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వీరి పెళ్లి ఎక్కడ ఏంటి అని వివరాలను మాత్రం వెల్లడించలేదు త్వరలోనే ఈ విషయాలను కూడా అధికారికంగా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.
అల్లు శిరీష్, నైనిక రెడ్డిల వివాహం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు.


