|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు.. టార్చర్ చేస్తున్నారంటూ అమల షాకింగ్ కామెంట్స్ (వీడియో)

Published: 02-07-2025, 5:26 AM
అక్కినేని ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు.. టార్చర్ చేస్తున్నారంటూ అమల షాకింగ్ కామెంట్స్ (వీడియో)

అక్కినేని నాగార్జున ఇంటికి నలుగురు వ్యక్తులు చొరబడిన ఘటనలో అమల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. వారిని తీవ్రంగా తిట్టిన అమల వీడియో వైరల్ అవుతోంది.

Key Points

1

అమల, అక్కినేని ఇంటికి వచ్చిన నలుగురిని తిట్టింది.

2

వారు అభిమానులు కాదని, రౌడీలు అని అమల ఆరోపించింది.

4

కొందరు నెటిజన్లు ఇది పాత వీడియో అని అంటున్నారు.

అమల ఆగ్రహం

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయన గత కొద్ది కాలంగా మన్మధుడిగా అమ్మాయిల మనసులు గెలుచుకుంటున్నారు. ఇక ఇటీవల ‘కుబేర’(Kubera)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ధనుష్, రష్మీక, నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం నాగార్జున ‘కూలీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నాగార్జున సినిమాల విషయం పక్కప పెడితే ఆయన ఇంట్లోకి ఓ నలుగురు వ్యక్తులు చొరబడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వారిని చూసిన అమల(amala) బయటకు పంపించి తనే వచ్చి వారితే ముచ్చటించింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘‘మీరు అసలు అక్కినేని అభిమానులే కాదు. సినిమాలు ఫ్యాన్స్ కోసమే తీస్తున్నారు. కానీ ఆ తర్వాత చాలామంది నెత్తిమీద కూర్చుంటున్నారు. అభిమానులు ఇలా చేయరు. మీరంతా క్రిమినల్స్.. టార్చర్ చేస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌లో సెక్షన్ ఉంది. మీరు అభిమానులం అనే పదాన్ని చెడుకు ఉపయోగిస్తున్నారు. అది తప్పు నేర్చుకోండి. మీ ఇంట్లోకి వచ్చి ఇలా చేస్తే మీకెలా ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీరు అసలు అభిమానులే కాదు రౌడీలు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది పాత వీడియో అని కొందరు అంటున్నారు.

వైరల్ వీడియో

నెటిజన్ల స్పందన

అమలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇది పాత వీడియో అయ్యే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.