
న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఆర్థికంగా అభివృద్ధి అవుతుందని నమ్ముతారు. ఈ కథనంలో ఆ విషయం గురించి తెలుసుకుందాం.
Key Points
4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన స్త్రీలు కష్టపడి పనిచేస్తారు.
న్యూమరాలజీ ప్రకారం, వీరికి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది.
మీడియా, రాజకీయాలు, నాయకత్వం వంటి రంగాల్లో వీరు సక్సెస్ అవుతారు.
నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ధైర్యంగా ఉంటారు.
న్యూమరాలజీ మరియు పుట్టిన తేదీల ప్రాముఖ్యత
న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి తీరు, ప్రవర్తన గురించి చెప్పడంతో పాటుగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. రాడిక్స్ సంఖ్య ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి సంఖ్యకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఒక మనిషి వ్యక్తిత్వం, కెరీర్, భవిష్యత్తు వంటి వాటిని పుట్టిన తేదీ ద్వారా తెలుసుకోవచ్చు.
కొన్ని తేదీల్లో పుట్టిన వారు హఠాత్తుగా ధనవంతులవుతారు. డబ్బు వారి వెంట ఎల్లప్పుడూ ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎల్లప్పుడూ డబ్బుతో సంతోషంగా ఉంటారు. డబ్బుకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికపరంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేయరు.
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య నాలుగు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. వ్యక్తిత్వం, ఆలోచన విధానం, నిర్ణయాలు వంటి వాటికి కారకుడు.
4, 13, 22, 31 తేదీల ప్రత్యేకత
పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎంతో కష్టపడి పని చేస్తారు. అనుకున్నవి పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఎంతో కష్టపడి పని చేస్తారు. దీంతో ఆర్థికపరంగా కూడా ఎల్లప్పుడూ వీరికి సమస్యలు రావు. ఎల్లప్పుడూ డబ్బుతో సంతోషంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడరు. ఈ తేదీల్లో పుట్టిన వారు నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేయరు. ఏ మాత్రం భయం ఉండదు. ఫలితం ఏదైనా అవ్వని అని ముందే నిర్ణయం తీసుకుంటారు. దీనితో అనుకున్న వాటిని సులువుగా సక్సెస్ అవుతారు.
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీడియా, పాలిటిక్స్, నాయకత్వం, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి బాగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.
వృత్తి మరియు ఆర్థిక విజయం
పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారు నిజాయితీగా ఉంటారు. అదే విధంగా ఎప్పుడూ క్రమశిక్షణతో ఉంటారు. ఇతరులకు గౌరవం ఇస్తారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ సమాచారం న్యూమరాలజీ ఆధారంగా ఉంది. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కష్టపడి పనిచేస్తే విజయం సాధ్యమే.


