
సుమంత్ నటించిన ‘అనగనగా’ సినిమా థియేటర్లను దాటవేసి, నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో మే 15న విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, విద్యావ్యవస్థపై ప్రేరణాత్మక సందేశాన్ని అందిస్తుందని తెలుస్తోంది.
Key Points
సుమంత్ హీరోగా నటించిన 'అనగనగా' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల.
మే 15న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం.
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు.
విద్యావ్యవస్థపై ప్రేరణాత్మక సందేశంతో కూడిన చిత్రం.
అనగనగా: ఓటీటీ విడుదల వివరాలు
సుమంత్ హీరోగా నటించిన తెలుగు మూవీ అనగనగా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అనగనగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను శనివారం ఓ వీడియో ద్వారా ఈటీవీ విన్ అనౌన్స్‌చేసింది. మే 15న విడుదలకాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ వీడియోలో సుమంత్ బుక్ చదువుతుండగా…అతడి కొడుకు ప్రశ్నలతో విసిగించడం కనిపించింది. ప్రతి కథ అనగనగాతో ఎందుకు మొదలవుతుంది. కనీసం ఈ ప్రశ్నకైనా సమాధానం చెప్పమని సుమంత్‌ను అతడి కొడుకు అడిగాడు. ఒక మంచి కథ…స్నేహం, ప్రేమ, లేదా ఓ చిన్న జ్ఞాపకాన్ని గుర్తుచేస్తుందని సుమంత్ సమాధానం ఇచ్చినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
అయితే మన కథ కూడా చెప్పొచ్చుగా అని చిన్నారి అడగ్గా…సుమంత్ సరే అని బదులివ్వడం ఈ వీడియోలో ఆసక్తిని పంచుతుంది. సుమంత్… అనగనగా అని అనగానే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చూపించారు. మే 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
సుమంత్ మరియు కాజల్ జంట
విద్యా వ్యవస్థకు సంబంధించిన మంచి మెసేజ్‌తో అనగనగా మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ మూవీలో ఇందులో సుమంత్ టీచర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వ్యాస్ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.
అనగనగా మూవీకి సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనగనగా మూవీలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిస్ యూనివర్స్ బీహార్ 2024గా కాజల్ చౌదరి ఇటీవలే ఎంపికైంది. సుమంత్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో సుమంత్, కాజల్ చౌదరితో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ విహార్ష్ , అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
చిత్ర కథాంశం మరియు ప్రత్యేకతలు
కెరీర్ ఆరంభం నుంచి సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తోన్నాడు సుమంత్. కెరీర్ ఆరంభంలో గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి సినిమాలతో సక్సెస్‌లను అందుకున్నాడు సుమంత్. ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న సుమంత్ మళ్లీ రావాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. కొన్నాళ్లుగా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోన్నాడు సుమంత్. దుల్కర్ సల్మాన్ సీతారామంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేశాడు. ధనుష్ సార్ సినిమాలో గెస్ట్‌గా కనిపించాడు.
ప్రస్తుతం సుమంత్ మహేంద్రగిరి వారాహి పేరుతో ఓ డివోషనల్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
సుమంత్ కెరీర్‌లో మరో ప్రయత్నంగా ‘అనగనగా’ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను చేరుకోనుంది. కాజల్‌తో కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

