|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేరుగా ఓటీటీలోకి అనగనగా.. మనసును హత్తుకునేలా సుమంత్ మూవీ ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Published: 09-05-2025, 9:05 AM
నేరుగా ఓటీటీలోకి అనగనగా.. మనసును హత్తుకునేలా సుమంత్ మూవీ ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈటీవీ విన్ లో విడుదలవుతున్న సుమంత్ నటించిన ‘అనగనగా’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాగ చైతన్య చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్, సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తుంది.

Key Points

1

సుమంత్ నటించిన 'అనగనగా' సినిమా ట్రైలర్ విడుదలైంది.

2

నాగ చైతన్య ట్రైలర్ ను లాంచ్ చేశారు.

4

తండ్రీకొడుకుల మధ్య బంధం, పిల్లలకు కథల ప్రాముఖ్యత చూపే కథ.

అనగనగా ట్రైలర్ విడుదల

ఈటీవీ విన్ ఓటీటీలోకి మరో సందేశాత్మక సినిమా వస్తోంది. ఈ మూవీ పేరు అనగనగా. సుమంత్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం.

అనగనగా మూవీ తండ్రీకొడుకుల సెంటిమెంట్ తోపాటు పిల్లలకు చదువుతోపాటు కథలు ఎంత ముఖ్యమో చెబుతూ సాగేలా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. శుక్రవారం ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నాగ చైతన్య తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. “ఓ అందమైన, హృదయాన్ని తాకే ట్రైలర్ ఇది. అనగనగా.. ఓ మనసును హత్తుకునే మూవీ మే 15న ఈటీవీ విన్ లో రిలీజ్ కాబోతోంది. సుమంత్ అన్న నటించిన ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మొత్తం టీమ్ కు నా అభినందనలు” అనే చైతూ ట్వీట్ చేశాడు.

నాగ చైతన్య ప్రత్యేకత

అటు ఈటీవీ విన్ ఓటీటీ కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్రైలర్ షేర్ చేసింది. “అనగనగా.. రామ్, వ్యాస్‌ల ఓ మనసును తాకే కథ. మే 15 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ ను యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేశాడు. మీ సపోర్ట్ కు థ్యాంక్యూ” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్రైలర్ ను పంచుకుంది.

అనగనగా మూవీలో వ్యాస్ అనే టీచర్ పాత్రలో సుమంత్ నటించాడు. పిల్లలకు మార్కులు, ర్యాంకుల కంటే కథల ద్వారా వాళ్ల క్రియేటివిటీని పెంచడమే ముఖ్యమని నమ్మే పాత్ర అతనిది. తన కొడుకు రామ్ కు కూడా అలా కథలు చెబుతూనే పెంచుతాడు.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

అయితే వ్యాస్ భార్య ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. అందులోనే రామ్ కూడా చదువుతుంటాడు. అతడు చదువులో వెనుకబడిపోతాడు. మిగిలిన పిల్లల పరిస్థితి కూడా అలాగే మారడంతో భార్య సహా అందరూ దానికి వ్యాస్ నే నిందిస్తారు. అయినా వెనక్కి తగ్గని వ్యాస్.. తానే సొంతంగా ఓ చిన్న స్కూల్ పెట్టుకొని పిల్లలకు అనగనగా అంటూ కథలు చెబుతుంటాడు. తన తండ్రిపై రామ్ కు ఎంతో ప్రేమ.

అయితే వ్యాస్ ధోరణి భార్యాభర్తల మధ్య గొడవకు కారణమవుతుంది. ఆ ఇద్దరి మధ్య ఆ చిన్నారి సతమతమవుతుంటాడు. ఈ కాలం పిల్లలు మార్కులు, ర్యాంకులు అంటూ కథలకు ఎలా దూరమవుతున్నారు? ఆ కథలు వాళ్లలో ఎలా క్రియేటివిటీని పెంచుతాయో చెబుతూ తీసిన ఓ సందేశాత్మక మూవీ అనగనగా. ఈ సినిమాను సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశాడు. రాకేష్ రెడ్డి, రుద్ర మాదిరెడ్డి నిర్మించారు. ఈ అనగనగా మూవీ మే 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

సుమంత్ నటన, సందేశాత్మక కథాంశంతో ‘అనగనగా’ సినిమా ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. మే 15 నుంచి ఈటీవీ విన్ లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.