
ప్రముఖ తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ తన ప్రేమ విషయంలో మోసపోయి ఎలా బాధపడిందో, తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అవకాశాల గురించి ఆమె తన అనుభవాలను పంచుకుంది. ఆమె కష్టాలను అధిగమించి ఎలా ముందుకు సాగిందో తెలుసుకుందాం.
Key Points
అనన్య నాగళ్ళ తన బ్రేకప్ గురించి వెల్లడించింది.
మూడేళ్ల పాటు బాధపడినట్లు చెప్పింది.
తెలుగు హీరోయిన్లకు అవకాశాల కొరత గురించి మాట్లాడింది.
తనకు తానుగా మార్కెటింగ్ చేసుకుంటున్నట్లు తెలిపింది.
అనన్య నాగళ్ళ బ్రేకప్ బాధ
ప్రేమలో మోసపోయానంటోంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ( Ananya Nagalla ). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో నా మనసుకు, మెదడుకు, చేతలకు సంబంధమే లేకుండా పోయింది. అతడికి ఫోన్ చేయడం ఇష్టం లేకపోయినా నాకు తెలీకుండానే ఫోన్ చేసేవాడిని. ఎందుకు చేశానో అర్థమయ్యేది కాదు. రెండు, మూడేళ్లపాటు చాలా బాధపడ్డాను.
కేరవాన్‌లో ఏడ్చేసి.. కానీ, చేసే పనిపై దాని ప్రభావాన్ని పడనివ్వలేదు. రాత్రంతా ఏడ్చి ఉదయాన్ని జిమ్‌కు వెళ్లిపోయేదాన్ని. కేరవాన్‌లో ఏడ్చేసి.. ఏం జరగనట్లు కళ్లు తుడుచుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని. ఈ బాధలో నుంచి బయటకు వస్తానా? లేదా? అనుకున్నాను. తర్వాత ఇదంతా ఒక మాయ అని తెలుసుకుని బయటపడ్డాను అని తెలిపింది.
తెలుగు సినిమాలో అవకాశాల కొరత
తెలుగమ్మాయికి అవకాశాలు తక్కువ? తెలుగమ్మాయిలకు వస్తున్న అవకాశాల గురించి అనన్య మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్. హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది, అప్పుడే హీరోయిన్లను సినిమాలో పెట్టుకుంటారు. వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగింది. మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. కానీ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే వచ్చినన్ని అవకాశాలు.. తెలుగమ్మాయి బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే రావట్లేదు. ఇదే నిజం. హిట్స్ ఉన్నా ఎందుకు మంచి అవకాశాలు రావడం లేదని కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నాకోసం నేను మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను.
నాకు నేనే మార్కెటింగ్ సినిమాల్లో యాక్ట్ చేసి వదిలేయకుండా వాటి ప్రమోషన్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేశాను. దానివల్ల నాకంటూ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్టులు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన అనన్య.. వకీల్ సాబ్, తంత్ర, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించింది. పొట్టేల్ సినిమాకుగానూ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.
అనన్య నాగళ్ళ కెరీర్ ప్రయాణం
తన వృత్తి జీవితంపై దృష్టి సారించి, తనకు తానుగా మార్కెటింగ్ చేసుకుంటూ అనన్య తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నారు.


