
📌 Key Points
- మహిళల వస్త్రధారణపై వివాదం నేపథ్యంలో అనసూయ మళ్ళీ చర్చలో నిలిచారు.
- గతంలో ‘రాశిగారి ఫలాలు’ వ్యాఖ్యలపై నటి రాశి ఘాటుగా స్పందించారు.
- రాశి అనసూయ పేరు చెప్పకుండానే చురకలు అంటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
- తన పాత వ్యాఖ్యల పట్ల అనసూయ ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు.
టాలీవుడ్‌లో కొనసాగుతున్న వివాదం అనసూయను మళ్ళీ వార్తల్లోకి తెచ్చింది. గతంలో నటి రాశిని ఉద్దేశించి అనసూయ చేసిన ‘రాశిగారి ఫలాలు’ వ్యాఖ్యలపై రాశి తాజాగా స్పందించారు. ఈ నేపథ్యంలో అనసూయ తన పాత కామెంట్‌కు అధికారికంగా క్షమాపణలు కోరారు, ఇది సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
రాశిగారి ఫలాలు: పాత వివాదంపై రాశి ఘాటు వ్యాఖ్యలు
Anasuya Bhardwaj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళల వస్త్రధారణ గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే శివాజీ ఒక సినిమా వేడుకలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించడంతో అనసూయ(Anasuya) కూడా వివాదంలో నిలిచారు. ఈ విషయంలో ఎంతోమంది అనసూయకు మద్దతు తెలియజేయగా మరికొందరు అనసూయ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఇప్పటికీ ఈ వివాదం సర్దుమనగలేదని చెప్పాలి. ఇలా అనసూయ ఈ వివాదంలో సీనియర్ నటి రాశి(Rasi) కూడా స్పందించారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా అనసూయ తనని ఉద్దేశించి “రాశి గారి ఫలాలు” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై ఇటీవల రాశి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాశి అనసూయ పేరును ఎక్కడ ప్రస్తావించకుండా ఆమెకు తనదైన శైలిలోనే చురకలు అంటించారు. శివాజీ మాటలు 100% తప్పు అని నేను అనను కొన్ని పదాలు తప్పుగా వాడారు సారీ కూడా చెప్పారు. ఒక ఆవిడ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. ఆవిడ ఓషోలో యాంకర్ రాశిగారి ఫలాలు అంటూ మాట్లాడారు. ఒక లేడీగా ఆమె ఆ పదాలను ఎలా వాడారు? ఈ ఘటన పట్ల తాను లీగల్ గా వెళ్దాం అనుకున్నాను కానీ అప్పటికి అమ్మ సర్ది చెప్పడంతో ఆగిపోయాను అంటూ రాసి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా అనసూయ పేరు చెప్పకపోయినప్పటికీ రాశి అనసూయను ఉద్దేశించే మాట్లాడారని స్పష్టమవుతుంది.
ఈ నేపథ్యంలోనే అనసూయ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రాశి గారి గురించి గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు వివాదం చెలరేగడంతో ఈమె స్పందిస్తూ క్షమాపణలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అనసూయ ఒక పోస్ట్ విడుదల చేస్తూ “డియర్ రాశి గారు.. నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి, నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించడం జరిగింది.
అనసూయకు చురకలు: పరోక్షంగా రాశి ఏమన్నారు?
@RaasiActress ma’am 🙏🏻 pic.twitter.com/DZLfUNp6rr
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026
అధికారికంగా క్షమాపణలు: అనసూయ ఎక్స్ పోస్ట్
ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆరోజు నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. నేను అలా మాట్లాడటం పొరపాటే దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి.. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరి చేయలేను. ఆ షోలో డబుల్ మీనింగ్ మాటలను ఖండించడం దగ్గర నుంచి ఆ షో నుంచి బయటకు రావడం అనేది నాలో వచ్చిన మార్పును మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి మాటలను బయట పెడుతూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని నేను ఊహించగలను. ఈ కార్యక్రమానికి సంబంధించిన దర్శకులు, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పకపోయినా బాధ్యతగా నేను నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎవరైతే మహిళల గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో వారిని ఎదిరించడానికి గతంలో కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని, ఈ విషయాన్ని మీరు గుర్తించి మీ మద్దతు తెలియజేస్తారని” ఆశిస్తున్నాను అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
అనసూయ క్షమాపణలతో ‘రాశిగారి ఫలాలు’ వివాదం సద్దుమణుగుతుందా లేదా అనేది చూడాలి. అయితే, పాత వ్యాఖ్యలకు ఇప్పుడు సారీ చెప్పడం మాత్రం సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.


